రాయ్‌పూర్ : మావోయిస్టులకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో తూటల మోతకు అటవి ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆదివారం బీజాపూర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారంతా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) సంస్థకు చెందిన వారని సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని.. మృత దేహాలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నామని మీనా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment