
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 14మంది మవోయిస్టులు మరణించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 42 మంది మవోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment