
ఈసీ నోటీసులు.. మండిపడ్డ మమత
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారత ఎన్నికల కమిషన్ నోటీసులు పంపించింది. బెంగాల్ కొత్త సంవత్సరం రోజు ఆమెకు షోకాజ్ నోటీసులు పంపించింది.
ఎన్నికల కోడ్ ఉండగా ఆమె ప్రజలను ప్రేరేపించేలా ప్రసంగించి నిబంధనను ఉల్లంఘించారని, అసన్ సోల్ను జిల్లాగా మారుస్తానని ప్రజలకు మమత బెనర్జీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపించినట్లు తెలిపారు. కాగా, ఈ నోటీసులు పంపించడంపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 19న వాళ్లకు ప్రజలే షోకాజ్ నోటీసులు ఇస్తారని మండిపడ్డారు.