సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు, చొరబాట్లకు చెక్‌పెట్టేందుకు విరివిగా వాడుతున్న డ్రోన్లను తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల కోసం ఈసీ ఉపయోగిస్తోంది. యూపీలోని గౌతంబుద్ధ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో పదివేల మంది భద్రతా సిబ్బందితో పాటు డ్రోన్లనూ నిఘా నిమిత్తం ఈసీ వినియోగిస్తోంది.
జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై కన్నేసిఉంచేందుకు 13 డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 23,995 పోలింగ్ కేంద్రాల్లో 163 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాగా, వీటిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా నిఘా పెంచామని, ఘర్షణలు చెలరేగిన చోటకు హుటాహుటిన అదనపు బలగాలు తరలిస్తామని జిల్లా మేజిస్ర్టేట్ బీఎన్ సింగ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment