ముగిసిన ప్రభాగ్ సమితుల ఎన్నికలు | elections are comleted for sahar muncipality | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రభాగ్ సమితుల ఎన్నికలు

Published Fri, Jun 13 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

ముగిసిన ప్రభాగ్ సమితుల ఎన్నికలు

ముగిసిన ప్రభాగ్ సమితుల ఎన్నికలు

విజేతలకు సన్మానం
 
భివండీ, న్యూస్‌లైన్: నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక పరిధిలో గల 1 నుంచి 5 ప్రభాగ్ సమితుల చైర్మన్ పదవులకు ఎన్నికలు శుక్రవారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ప్రభాగ్ సమితి 1 చైర్మన్‌గా శివసేన అభ్యర్థి అశ్విణి అరుణ్ రావుత్, ప్రభాగ్ సమితి 2 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఫర్జానా ఇస్మైల్ మిర్చి, ప్రభాగ్ సమితి 3 నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లలిత నితిన్ భజాగే, అలాగే ప్రభాగ్ సమితి 5 నుంచి కోనార్క్ వికాస్ ఆగాడికి చెందిన నితిన్ రఘునాథ్ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
ప్రభాగ్ సమితి 4 నుంచి బీజేపీ తరఫున యోగితా అనిల్ పాటిల్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పర్వేజ్‌పై ఆమె విజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికల అధికారి కొంకణ్ విభాగ కమిషనర్ దిలీప్ సమక్షంలో పోలింగ్ నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులను కార్పొరేటర్లు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. సన్మాన కార్యక్రమంలో మేయర్ ప్రతిభా పాటిల్, మాజీ మేయర్ విలాస్ పాటిల్, ఘట్‌నేత సంతోష్ శెట్టి, నీలేష్ చౌదరి, జావిద్ దల్వీ, మురళి మచ్చ, మహేష్ చౌగులే, హనుమాన్ చౌదరి, లక్ష్మీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement