కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి | re-election in koratla | Sakshi
Sakshi News home page

కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి

Published Tue, May 6 2014 2:50 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి - Sakshi

కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి

 హైకోర్టును ఆశ్రయించనున్న శివసేన అభ్యర్థి
 కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌పై హైకోర్టులకు వెళ్లనున్నట్లు శివసేన నియోజకవర్గ అభ్యర్థి కరిజెంగుల నరేశ్ తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తమకు కేటాయించిన బాణం-విల్లు గుర్తు తారుమారైందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన  స్పందన కరువైందన్నారు. దీంతో మంగళవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి పొరపాట్లకే కోడ్ ఉల్లంఘన కేసులు పెట్టే ఎన్నికల కమిషన్.. గుర్తు కేటాయింపులో వారే తప్పు చేశారన్నారు. సమావేశంలో శివసేన నాయకులు గట్ల విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్‌రామాగౌడ్, ఇందూరి వేణుగోపాల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement