koratla
-
ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు
కోరుట్ల: కరోనా వైరస్ ఆత్మీయత, అనుబంధాలకు అడ్డు తెరలు కడుతోంది. చివరి చూపు.. స్పర్శకు నోచుకోకుండా నా అన్నవాళ్లను దూరం చేస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరూ దరిచేరని దయనీయ స్థితిలో కరోనా మృతుల అంత్యక్రియలను తమ భుజాలపై వేసుకుంటున్నారు కోరుట్లకు చెందిన పలువురు యువకులు. భయానక వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంటే ధైర్యం కోల్పోకుండా మానవత్వంతో మృతదేహాలకు కడసారి వీడ్కోలు పలుకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారం వ్యవధిలో 12 మంది మృతి... కోరుట్ల పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో 12 మంది కరోనాతో జగిత్యాల, కరీంనగర్, హైద్రాబాద్‌లలోని ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడి, దగ్గరికి కూడా రాలేదు. ఎక్కడ కరోనా వైరస్ తమకు సోకుతుందోనని ఆందోళన చెంది, దూరంగా ఉన్నారు. అంతటా ఓదార్పు మాటలే తప్ప దహన సంస్కారాలు చేసేందుకు సాహసించని పరిస్థితి. అన్నిచోట్లా ఇది నిత్యకృత్యమవుతోంది. యువత బాసట.. బాధితులకు ఊరట కోవిడ్ మృతుల అంత్యక్రియలకు భయపడుతున్న నేపథ్యంలో కోరుట్ల యువత తామున్నామని ముందుకు రావడం బాధిత కుటుంబాలకు ఊరటనిస్తోంది. కోరుట్ల పట్టణంలో ఇప్పటివరకు చనిపోయిన 12 మందికి స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు, మానవ సందేశ సమితి ఆధ్వర్యంలోని ఇందాదుల్ ముస్లిమీన్ యూత్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న యువకులను ప్రతిఒక్క రూ అభినందిస్తున్నారు. మానవత్వంతో చేస్తున్నాం.. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. బీజేపీ, బీజేవైఎం నాయకులందరం కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాం. మానవత్వంతో కోవిడ్ మృతులకు దహన సంస్కారాలు చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు 45 మందికి అంత్యక్రియలు నిర్వహించాం. – మాడవేని నరేష్, బీజేపీ ఫ్లోర్ లీడర్, కోరుట్ల ఎంతో పుణ్యం.. కరోనాతో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వైరస్‌తో ఎక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేసేందుకు మా యువత ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కరోనా ప్రారంభంలో మానవత్వ సందేశ సమితి ప్రోత్సాహంతో మృతులకు అంత్యక్రియలు పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. – అలీమొద్దీన్, ఇందాదుల్ ముస్లిమీన్ యూత్ అధ్యక్షుడు, కోరుట్ల ( చదవండి: వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి? ) -
మధుయాష్కీకి నిరసన సెగ
మెట్పల్లి (కోరుట్ల): కాంగ్రెస్ నేత మధుయాష్కీకి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొమురెడ్డి రాములు వర్గీయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం రాత్రి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి టికె ట్ రాకుండా చేశారని రాములు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. డబ్బులు పంచేందు కు ఇక్కడికి వచ్చారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది. మధుయాష్కీ కొందరితో కలసి రెండు వాహనాల్లో పట్టణంలోని చైతన్యనగర్లోని ఓ ఇంటికి వ చ్చారు. విషయం తెలుసుకున్న రాములు వర్గీయులు తమ నాయకుడికి టికెట్ రాకుండా చేశారని నిలదీశారు. మధుయాష్కీ వచ్చిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రావడమే కాకుండా పెద్దఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ అ క్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. మధుయాష్కీతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోతుండటంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తర్వాత వాహనం దిగి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వాహనాలను డ్రైవర్లు తీసుకువెళ్తుండగా.. వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిని ఖండించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్‌పై గురువారం రాత్రి మెట్పల్లిలో జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఈ దాడి అనాగరికమైన చర్య అని, ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. -
పల్లె.. కన్నీరు పెట్టింది!
కోరుట్ల/కోరుట్లరూరల్: పల్లె కన్నీరుమున్నీరైంది...మానవత్వంతో కదిలింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆ తల్లీ కొడుకుల కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో గురువారం సాయంత్రం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఒకే చితిపై తల్లీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించగా ఆడకూతుళ్లు చితికి నిప్పంటించిన వైనం అందరినీ కలచివేసింది. నష్టాల సాగు.. వెక్కిరించిన గల్ఫ్ వ్యవసాయంలో నష్టాలు.. వెక్కిరించిన గల్ఫ్ వలస ఫలితంగా పెరిగిన అప్పులు మారం శ్రీనివాస్‌ను ఆత్మహత్యకు పురిగోల్పాయి. 40 ఏళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా టేకుమల్ల మండలం అసిరెడ్డి పల్లె నుంచి మారం శ్రీనివాస్ కుటుంబం గుమ్లాపూర్‌కు వలస వచ్చింది. తం డ్రి వెంకట్రామ్రెడ్డి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో కుటుంబ భారం ఒక్కగానొక్క కొడుకు మా రం శ్రీనివాస్‌పై పడ్డాయి. అంతకు ముందే 14 ఏళ్లు గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ అక్కడ పనులు సరిగా లేక తిరిగివచ్చాడు. ఆ తరువాత తల్లి నీలమ్మ, భార్య తిరుమలతో కలిసి వరంగల్ జిల్లా చిట్యాల మండలం కొత్తపేటలో రెండు ట్రాక్టర్లు కొనుక్కుని భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయం అంతంతగానే ఉండగా ట్రాక్టర్ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ సమయంలో దాదాపు రూ.8 లక్షల పరిహారం చెల్లించాడు. గల్ఫ్..వ్యవసాయం..ట్రాక్టర్ యాక్సిడెంట్ ఇలా ఎటు నుంచి చూసినా శ్రీనివాస్‌ను నష్టాలే వెక్కిరించాయి. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి గుమ్లాపూర్తోపాటు కొత్తపేటలోనూ అప్పులు చేశాడు. అవి దాదాపు రూ.25 లక్షలకు చేరుకున్నాయి. పెరిగిన ఒత్తిడి.. నాలుగు నెలల క్రితం వరకు టేకుమల్ల మండలం కొత్తపేటలో ఉన్న మారం శ్రీనివాస్ కుటుంబం అక్కడ అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిపోవడంతో కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో సొంతింటిలో ఉంటున్న తల్లి నీలమ్మ వద్దకు వచ్చి ఉంటున్నాడు. కొత్తపేట నుంచి వచ్చినప్పటికీ గుమ్లాపూర్‌లో అప్పులు ఉండటంతో శ్రీనివాస్ సతమతమయ్యాడు. స్థానికంగా అప్పుల ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని అప్పుల కింద రూ.17 లక్షలకు అప్పగించాడు. ఈ క్రమంలో తల్లి నీలమ్మతో గొడవలు జరిగినట్లు సమాచారం. గుమ్లాపూర్‌లో ఇల్లు అమ్మి అప్పులు కడుతున్నాడన్న విషయం తెలుసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తులు తమ బాకీ వసూలుకు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మరోమార్గం లేక శ్రీనివాస్ ఆత్మహత్యకు నిర్ణయించుకున్నాడు. ఇంటిపై మమకారం.. 40 ఏళ్లుగా నీడనిచ్చిన ఇంటిని అమ్మే విషయంలో మారం శ్రీనివాస్‌కు, తల్లి నీలమ్మకు కొంత మేర విభేదాలు వచ్చినప్పటికీ కొడుకు పరిస్థితిని చూసి చివరికి ఇల్లు అమ్మేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అప్పుల బాధతో వేగలేక చావడానికి నిశ్చయించుకున్న శ్రీనివాస్ తను లేకుంటే అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరని తీవ్రవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తల్లితోపాటు తాను విషం తీసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. గురువారం భార్య తిరుమల బట్టల షాపులో పనికి కోరుట్లకు వెళ్లిపోగానే పురుగుల మందును అందుబాటులో ఉంచుకున్న శ్రీనివాస్ సాయంత్రం తన కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు ఇంటికి రాగానే వారిని ఏమైనా కొనుక్కొమని చెప్పి షాప్‌కు పంపినట్లు తెలిసింది. పిల్లలు బయటకు వెళ్లగానే తల్లి నీలమ్మకు విషం ఇచ్చి తాను తాగి దూలానికి ఉరి వేసుకున్నాడు. గ్రామస్తుల మానవత్వం.. అప్పుల బాధతో తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గుమ్లాపూర్‌లో విషాదం నెలకొంది. భార్య తిరుమల, కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా గ్రామస్తులు అంత్యక్రియల కోసం రూ.38 వేలు చందాలు వేసుకున్నారు. టేకుమల్ల మం డలం అసిరెడ్డిపల్లి నుంచి మారం శ్రీనివాస్ అత్తగారి తరçపున బంధువులు రాగానే గ్రామస్తులు అంతా కలిసి శ్రీనివాస్, నీలమ్మ మృతదేహాలను ట్రాక్టర్లో ఎక్కించి శ్మశానానికి తరలించారు. ఒకే చితిపై తల్లీకొడుకుల మృతదేహలను ఉంచగా శ్రీనివాస్ భార్య తిరుమల, కూ తురు కీర్తన చితికి నిప్పు పెట్టారు. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కన్నీరుపెట్టించింది. -
కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి
హైకోర్టును ఆశ్రయించనున్న శివసేన అభ్యర్థి కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌పై హైకోర్టులకు వెళ్లనున్నట్లు శివసేన నియోజకవర్గ అభ్యర్థి కరిజెంగుల నరేశ్ తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తమకు కేటాయించిన బాణం-విల్లు గుర్తు తారుమారైందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందన్నారు. దీంతో మంగళవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి పొరపాట్లకే కోడ్ ఉల్లంఘన కేసులు పెట్టే ఎన్నికల కమిషన్.. గుర్తు కేటాయింపులో వారే తప్పు చేశారన్నారు. సమావేశంలో శివసేన నాయకులు గట్ల విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్‌రామాగౌడ్, ఇందూరి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, జమ్మికుంట, వే ములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్ నగర పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. జిల్లావ్యాప్తంగా 7,10,654 మంది ఓటర్లుండగా 41,84,480 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరీంనగ ర్ కార్పొరేషన్లో తక్కువగా 60 శాతం పోలింగ్ నమోదు కాగా.. హుస్నాబాద్ నగరపంచాయతీలో అత్యధికంగా 85.09 శాతం పోలింగ్ జరిగింది. 5గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో వంద మందికిపైగా కార్మికులు, కూలీలు పని ముగించుకుని సాయంత్రం 4గంటలకు స్థానిక 13వ డివిజన్లో ఉన్న ఆర్సీవో క్లబ్‌కు ఓటేసేందుకు వచ్చారు. దీంతో వారికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ కేంద్రంలో రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరిగింది. 24, 29, 42వ డివిజన్లలో ఈవీఎంలు మొరాయించగా వాటికి మరమ్మతులు చేపట్టి గంట తర్వాత ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈవీఎంలపై పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో హుజూరాబాద్‌లోని 15 వార్డులలో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సిరిసిల్లలో మున్సిపాలిటీ 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి యశ్వంత్‌కు నల్లా గుర్తు కేటాయించిన అధికారులు ఈవీఎంలో బోరింగ్ గుర్తు ఇవ్వడంతో అతడు నిరసనకు దిగాాడు. చివరకు 45 నిమిషాల ఆలస్యంతో యశ్వంత్‌కు నల్లాగుర్తు ఇచ్చిపోలింగ్ ప్రారంభించారు. చెదురుమదురు సంఘటనలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. 23వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతిపై మరో పార్టీకి చెందిన అభ్యర్థి బంధువులు దాడి చేశారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 39వ డివిజన్లో ఓట్లు గల్లంతవ్వడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలింగ్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఆర్డీవో చంద్రశేఖర్‌ను అడ్డుకున్నారు. డీఎస్పీ రవీందర్ అక్కడికి చేరుకొని అడ్డుగా ఉన్నవారిని తొలగించడంతో ఆర్డీవో వెళ్లిపోయారు. 11వ డివిజన్లో 400 ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు బాలికల ప్రభుత్వ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులు ఉన్నా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేపోతున్నాయని కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్‌తో మొరపెట్టుకున్నారు. 35వ డివిజన్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని కొంతమంది యువకులపై కాంగ్రెసేతర అభ్యర్థులు గొడవకు దిగారు. దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు పలువురిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత వదిలిపెట్టారు. రామగుండం కార్పొరేషన్లో పరిధిలోని 38వ డివిజన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జీలతో ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. రామగుండం కార్పొరేషన్ రాంనగర్లో రోడ్లపై టెంట్లు వేసి గుంపులు గుంపులుగా ఉండడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. రోడ్ల పక్కన వేసిన టెంట్లను కూల్చివేశారు. హుస్నాబాద్ 3వ వార్డులో పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్లకు ఒక్క ఓటు తేడా రావడంతో గందరగోళం నెలకొంది. వార్డులో 735 మంది ఓటర్లు ఉండగా, 634 ఓట్లు పోలైనట్లు అధికారులు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలో 633 ఓట్లే పోలైనట్లు చూపింది. అధికారులు ఒక ఓటరను నమోదు చేసుకునే సందర్భంలో ఎర్రర్ వచ్చిందని, అందుకనే ఓటు నమోదు కాలేదని పోలింగ్ అధికారి నరహరి తెలిపారు. ఈ ఓటు విషయంపై తర్జనభర్జనలు జరిగిన తరువాత ఏజెంట్లు ఈవీఎంల తరలింపునకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పెద్దపల్లిలో ఓ అభ్యర్థి దొంగ ఓట్లను వేయిస్తున్నాడనే అనుమానంతో ఏజంట్లు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అభ్యర్థి మద్దతుదారుల వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు స్వల్పగా లాఠీచార్జి చేశారు. రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ వీర్లపల్లిలో కాంగ్రెస్, టీబీజీకేఏస్ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్‌బూత్‌కు కొద్దిదూరంలో కాంగ్రెస్ అభ్యర్థి గూళ్ల వెంకటరమణ బంధువులు, టీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రామగుండం 32వ డివిజన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతవారణం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడికి యత్నం చేయగా పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ 20వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఇతర అభ్యర్థులను లోనికి అనుమతించి, తనను అడ్డుకోవడంపై స్వతంత్ర అభ్యర్థి ఆది మల్లేశం పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. జనం గుమిగూడటంతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు కరీంనగర్‌లోని 16వ డివిజన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, 36 డివిజన్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు. మెట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఓటు వేశారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నెమనేని రమేశ్‌బాబు, రామగుండంలో 46వ డివిజన్లోని ప్రజా పాఠశాలలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటుహక్కు వినియోగించుకున్నారు.