సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌తో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. యూపీతో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ నెలాఖరులో ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. యూపీలో 7 విడతల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లో ఒక విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. యూపీలో 15 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చే యాలనే లక్ష్యంతో ఉంది.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి లాభించొచ్చు. పంజాబ్‌లో అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి కాంగ్రెస్, ఆప్‌ల నుంచి.. గోవాలో అధికార బీజేపీ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. మణిపూర్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది.
ఫిబ్రవరి, మార్చిలో 5 రాష్ట్రాల ఎన్నికలు?
Published Mon, Oct 24 2016 1:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement