ఐఐటీ–జేఈఈ రాయబోయె అభ్యర్థులకు ఆధార్ కార్డులు జారీచేయడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ: ఐఐటీ–జేఈఈ రాయబోయె అభ్యర్థులకు ఆధార్ కార్డులు జారీచేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆధార్ నోడల్ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) అన్ని ప్రాంతీయ రిజిస్ట్రార్‌లు, నమోదు ఏజెన్సీలను ఆదేశించింది.
దరఖాస్తు సమయంలో విద్యార్థులు ఆధార్ వివరాలను తప్పకుండా పొందుపరచాలని సీబీఎస్‌ఈ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆధార్ నమోదు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ఆధార్ కార్డు పొందడానికి విద్యార్థులు ఎలాంటి రుసములు చెల్లించనక్కర్లేదని యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే తెలిపారు.