న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గతవారం జరిగిన కాంగోలీస్ విద్యార్థి మరణంపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి దక్షిణ ఆఫ్రికా దేశంలోనే రక్షణ లేదని విశాలమైన భారతదేశంలో ప్రమాదాలు సహజమనే రీతిలో కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశాలను సందర్శిచనున్నారు. దీంతో ఆయా దేశాలతో సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
గతంతో నేను ఆఫ్రికా వెళ్లినప్పుడు మార్నింగ్ వాక్ కు వెల్లబోతుంటే అక్కడి వారు బయట పరిస్థితులు అశాంతిగా ఉంటాయని చెప్పారని శర్మ అన్నారు. ఆఫ్రికన్ దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయని అన్నారు. విశాలమైన భారతదేశంలో చిన్న చిన్న ఘటనలు జరగడం సాధారణ విషయమని దీంతో దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయాని ఆందోళన చెందడం సరైంది కాదని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకుల కోసం 1363 హెల్ప్ లైన్ నంబర్ ను ప్రవేశ పెట్టబోతున్నట్టు మంత్రి వెల్లడించారు.