ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్ 15న ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనను అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఎంపీలే అశ్రద్ధ వహించారు. కేవలం 19 శాతం మంది ఎంపీలే ఈ పథకం కింద మూడు గ్రామాలను గుర్తించారు. మార్చి 2019 నాటికి ఎంపీలందరూ మూడు ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రధాని ప్రతి ఎంపీనీ కోరారు. అయితే 88 శాతం ఎంపీలు పథకం కింద కేవలం ఒక గ్రామానే ఎంపిక చేసుకోగా, 59 శాతం మంది ఎంపీలు రెండు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడం గమనార్హం.
ఇక బీజేపీ ఎంపీల్లో ఏకంగా 191 మంది ఇంతవరకూ మూడో గ్రామాన్ని ఎంపిక చేసుకోలేదు. 84 మంది రెండవ గ్రామాన్నీ ఎంపిక చేసుకోలేదు. ఇక బీజేపీ రాజ్యసభ ఎంపీల్లో 12 మంది మూడు గ్రామాలనూ ఇప్పటివరకూ ఎంపిక చేసుకోలేదు. 20 మంది కనీసం రెండవ గ్రామాన్నీఇంతవరకూ గుర్తించనేలేదు.తలా ఒక గ్రామాన్ని మాత్రం దాదాపు బీజేపీ ఎంపీలందరూ ఎంపిక చేసుకున్నారు. ఇక దశలవారీగా మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రి అతుల్ కుమార్ తివారీ చెప్పారు. ఇప్పటివరకూ ఎంపీలు గుర్తించిన 1314 గ్రామాల్లో 42 శాతం మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల ఎంపికను త్వరితగతిన పూర్తిచేసి ప్రధాని నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది.
Comments
Please login to add a commentAdd a comment