'కంప్యూటర్ పట్టాల్సిన చేత్తో రాళ్లేస్తున్నారు'
న్యూఢిల్లీ: చేతుల్లోకి కంప్యూటర్లు, క్రికెట్ బ్యాట్లు తీసుకోవాల్సిన కశ్మీర్ యువకులు రాళ్లు పట్టుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరం అని ఆయన అన్నారు. కశ్మీర్లో దేశంలోని ప్రతి పౌరుడు ఎంతో ప్రేమిస్తాడని.. కశ్మీరీలు భారతీయులు వేర్వేరు కాదని, భారత దేశ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని అన్నారు. కశ్మీర్లోని ప్రతి యువకుడిలో మంచి భవిష్యత్ చూడాలని అనుకుంటున్నామని అన్నారు.
మంచి జీవనంకోసం కశ్మీర్ పౌరులు ఏం కోరకుంటే అది అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఒక్క అభివృద్ధి ద్వారా సాధ్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి మాట్లాడుకోవడం, తీర్మానాలు పెట్టుకోవడంలాంటివి సహకరిస్తాయని చెప్ఓపారు.మానవత్వం, ప్రజాస్వామ్యం,కశ్మీరీయత్ అనే తమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నమ్మిన సిద్ధాంతాన్ని తాము విశ్వాసిస్తామని అన్నారు. మధ్యప్రదేశ్లోని అలిరాజ్ పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సమావేశంలో మోదీ ఈ ప్రసంగం చేశారు.