రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
Published Mon, Aug 21 2017 1:33 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
ఉత్తరప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లాల్‌గంజ్-ఫతేపూర్ రహదారిపై సోమవారం వెలుగుచూసింది. ద్విచక్రవాహనం పై వెళ్తున్న తండ్రీ కొడుకులు ప్రేమ్‌నాథ్(60), స్వామి ప్రసాద్(35)లను ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement