ఛీ..టీచర్.. ఎంత పనిచేసింది
ఛీ..టీచర్.. ఎంత పనిచేసింది
Published Fri, Mar 24 2017 1:35 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
రాజ్‌కోట్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే..విద్యార్థులను పెడదారి పట్టించేలా వ్యవహరించింది. గుజరాత్‌లోని పోరుబందర్ ప్రాథమిక పాఠశాల్లోని ఓ మహిళా టీచర్ విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించింది. అంతేకాకుండా విద్యార్థులను బట్టలు విప్పి డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేసింది. ఈ విషయం విద్యార్థుల తల్లితండ్రులకు తేలియడంతో ఆమెపై దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శారదా మందీర్ ప్రాథమిక పాఠశాల్లో టీచర్‌గా పనిచేస్తున్న గోస్వామి (50) గత రెండు నెలలుగా విద్యార్థులకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ, నగ్నంగా డ్యాన్స్ చేయాలని వేదిస్తుంది. ఎవరైన నగ్నంగా డ్యాన్స్ చేయకపోతే తీవ్రంగా కొట్టేదని పాఠశాల్లో 7వతరగతి చదువుతున్న విద్యార్థి తల్లి హలుబెన్ సెటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 293, 294, 506 చట్టాల కింద కేసులు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.
Advertisement
Advertisement