obscene clips
-
ఇదేం పాడు పని ప్రొఫెసర్.. విద్యార్థులకు అసభ్యకర వీడియోలు పంపి..
యశవంతపుర(బెంగళూరు): విద్యార్థులకు ఇన్‌స్టా గ్రాంలో అశ్లీల వీడియోలను పంపించిన మధుసూదన్ ఆచార్య అనే ప్రొఫెసర్‌ను నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. పోర్న్ వీడియోను విద్యార్థులకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ పాలక మండలి ఆయనను ఇంటికి పంపించింది. గౌరవమైన పదవిలో ఉంటూ విద్యార్థులకు అసభ్యకరమైన పోస్టులు చేయడం తలవంపులు తెచ్చేదిగా పేర్కొంది. -
కేరళ మంత్రి మీద ‘అశ్లీల వీడియో’కు ప్రయత్నం.. అరెస్ట్
కొచ్చి: కేరళలో సంచలనాలకు నెలవైన క్రైమ్ నందకుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సహ ఉద్యోగిణిని లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాదు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేరిట నకిలీ అశ్లీల వీడియోను తయారు చేయాలనుకున్న అతని ప్రయత్నం గుట్టు వీడిందిలా.. కేరళలో క్రైమ్ మాగ్జైన్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా టీపీ నందకుమార్ ఎంత పాపులర్ అయ్యాడో.. వివాదాలతోనూ అంతే వార్తల్లోకి ఎక్కాడు. క్రైమ్ వార్తల మీద సంచలనాత్మక కథనాలతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట ఇబ్బందికరమైన కంటెంట్‌ను ఇస్తుంటాడు. తాజాగా సహ ఉద్యోగిణిని వేధించిన కేసులో కొచ్చి పోలీసులు.. కాలూర్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. క్రైమ్ మ్యాగ్జైన్ చీఫ్ ఎడిటర్ అయిన టీపీ నందకుమార్.. తన దగ్గర పనిచేసిన ఓ ఉద్యోగిణి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపి తనను నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేశాడని భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి Veena Georgeలా ఉన్నావని, నీలిచిత్రంలో నటించమని, ఆ వీడియో ద్వారా మంత్రిని బద్నాం చేయొచ్చని నందకుమార్ ప్లాన్ వేసినట్లు ఆమె తెలిపింది. ఒకవేళ నీలిచిత్రంలో గనుక నటించకపోతే.. తనపై మార్ఫింగ్ కంటెంట్ చేసి ఇంటర్నెట్లో వదులుతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర మంత్రి నగ్న వీడియోలు ఉన్నాయంటూ నందకుమార్ గతంలోనే ఓ కథనం ప్రచురించాడు. ఈ నేపథ్యంలోనే తనపై అశ్లీల వీడియోలో నటించాలని బెదిరించాడని ఆమె మీడియాకు వివరించింది. ఇక బాధితురాలితో పాటు ప్రస్తుతం క్రైమ్ మ్యాగ్జైన్లో పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీంతో నందకుమార్‌పై ఐపీసీలోని సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నందకుమార్, మంత్రి వీణా జార్జ్‌ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె మీద ఫేస్బుక్, యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో కొక్కనాడ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజా పరిణామంతో తీరుమార్చుకోని నందకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, అలాగే క్రైమ్ మ్యాగ్జైన్ను మూసేయాలంటూ పలువురు నెటిజన్స్ కోరుతుండడం గమనార్హం. -
డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఫోర్న్ క్లిప్ షేరింగ్
పనాజీ : గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేల్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ముబైల్ ఫోన్ నుంచి ఒక వాట్సప్ గ్రూప్‌కు పోర్న్ క్లిప్ ఫార్వర్డ్ అయింది. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే వాట్సాప్ గ్రూపు సభ్యులు షాకయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని విజ్ఙప్తి చేశారు. కాగా, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ‘ నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేశారు’అని కవెల్కర్ ఆరోపించారు. కాగా, పోర్న్ క్లిప్ షేరింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని మండిపడుతోంది. ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ కవ్లేకర్ ఉద్దేశపూరకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని మండిపడుతున్నారు. -
ఛీ..టీచర్.. ఎంత పనిచేసింది
రాజ్‌కోట్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే..విద్యార్థులను పెడదారి పట్టించేలా వ్యవహరించింది. గుజరాత్‌లోని పోరుబందర్ ప్రాథమిక పాఠశాల్లోని ఓ మహిళా టీచర్ విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించింది. అంతేకాకుండా విద్యార్థులను బట్టలు విప్పి డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేసింది. ఈ విషయం విద్యార్థుల తల్లితండ్రులకు తేలియడంతో ఆమెపై దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శారదా మందీర్ ప్రాథమిక పాఠశాల్లో టీచర్‌గా పనిచేస్తున్న గోస్వామి (50) గత రెండు నెలలుగా విద్యార్థులకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ, నగ్నంగా డ్యాన్స్ చేయాలని వేదిస్తుంది. ఎవరైన నగ్నంగా డ్యాన్స్ చేయకపోతే తీవ్రంగా కొట్టేదని పాఠశాల్లో 7వతరగతి చదువుతున్న విద్యార్థి తల్లి హలుబెన్ సెటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 293, 294, 506 చట్టాల కింద కేసులు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.