
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో రెండవ సారి ఉగ్రమూకలు గ్రనేడ్ దాడితో విరుచుకుపడ్డాయి. శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని మార్కెట్‌లో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రనేడ్ దాడిలో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా గతనెల 28న ఉత్తర కశ్మీర్‌లోని సొపోర్‌లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో బ్రిటన్ ఎంపీల పర్యటనకు ఒకరోజు ముందు సొపోర్‌లోని హోటల్ ప్లాజాకు సమీపంలోని బస్టాండ్ వద్ద ఉగ్రమూకలు ఈ భీకర దాడికి పాల్పడ్డాయి. పీఓకేలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేస్తుండటంతో దిక్కుతోచని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సైన్యం పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment