అక్టోబర్ 15కల్లా శాశ్వత పీఎఫ్ ఖాతా | Finalized by October 15, Permanent Account | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 15కల్లా శాశ్వత పీఎఫ్ ఖాతా

Published Mon, Apr 21 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

Finalized by October 15, Permanent Account

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ శాశ్వత సంఖ్యను కేటాయించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ముమ్మర చర్యలు చేపట్టింది. అక్టోబర్ 15కల్లా తన ఐదు కోట్ల మంది వినియోగదారులకు ప్రత్యేకంగా వ్యక్తిగత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను అందుబాటులోకి తేచ్చే పనిలో పడింది. బ్యాంకు ఖాతా ఉన్న వారు ఏ బ్రాంచిలోనైనా సేవలు పొందినట్లే.. పీఎఫ్ ఖాతాదారులు యూఏఎన్‌తో అన్ని రకాల పీఎఫ్ సేవలు పొందవచ్చు.

ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేసుకోవడం లేదా కొత్త పీఎఫ్ ఖాతాను తెరవాల్సిన అవసరముండదు. దీంతో ఉద్యోగాలు మారే వారికి  చాలా వరకు ఇబ్బందులు తొలగుతాయి. అక్టోబర్ 15లోగా ప్రస్తుత ఖాతాదారులకు శాశ్వత పీఎఫ్ నంబర్‌ను కేటాయించి, ఆ తర్వాత కొత్తగా చేరే వారికి కూడా దీన్నే వర్తింపజేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సాంకేతిక సాయం కోసం కేంద్ర ఐటీశాఖ పరిధిలోని ‘సి-డాక్ ’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement