సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (గురువారం) మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించనున్న గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకానికి సంబంధించిన వివరాలను ఆర్థికమంత్రి ప్రకటించనున్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కాలంలో పట్టణాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ పథకాన్ని 2020 జూన్ 20 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అభియాన్‌ను ప్రారంభిస్తారు. రూ.50 వేల కోట్ల వ్యయంతో వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా 25 విభిన్న పనులు ఇందులో భాగంగా చేపడతారు.
Finance Minister @nsitharaman will address a curtain raiser press conference on #GaribKalyanRojgarAbhiyaan, ₹ 50,000 crore worth public works scheme to provide employment opportunities to returnee migrant workers
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) June 18, 2020
LIVE from 4 PM: https://t.co/ix8iooD6tchttps://t.co/jboEZg2MMS pic.twitter.com/Uqb24wvb2y
Comments
Please login to add a commentAdd a comment