న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని బవానా ఇండస్ట్రీ ఏరియాలోని ఓ ప్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటన స‍్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment