న్యూఢిల్లీ: లైబీరియా నుంచి వచ్చిన ఓ భారతీయుడికి ఎబోలా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన లైబీరియానుంచి వచ్చిన ఈ యువకుడికి ఢిల్లీ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో చికిత్స అందిస్తున్నారు. లైబీరియాలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు లేవని, అయితే వీర్యం నమూనాల పరీక్షలో ఎబోలా లక్షణాలు కనిపించడం తో అధికారులు అతన్ని విడిగా ఉంచి, చికిత్స అందిస్తున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది.
అయితే, చెమట, వీర్యం వంటి అతని శారీరక ద్రవాలపై ఎబోలా వైరస్ ప్రభావంలేదని నిర్ధారణ జరిగేవరకూ అతన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే పర్యవేక్షణలో ఉంచుతామని అధికారులు తెలిపారు. కాగా, రాజస్థాన్‌లో 35ఏళ్ల మరో వ్యక్తిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతన్ని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు జరిపారు.