ebola case
-
అది ఎబోలా కాదు.. కొత్త వైరస్!!
గాంధీ ఆస్పత్రిలో ఎబోలా కేసు కొత్త మలుపు తిరిగింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా ఉందన్న అనుమానాలతో అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అతడికి సోకినది ఎబోలా కాదని వైద్యులు స్పష్టం చేశారు. దాన్ని నైజీరియాకు చెందిన కొత్త వైరస్ అని వాళ్లు అంటున్నారు. ఈ వైరస్ సోకిన బాధితుడికి వైద్యం చేసేందుకు అక్కడి సిబ్బంది కూడా ముందుకు రావట్లేదు. దాంతో అతడి పరిస్థితి ఏంటన్నది కూడా ఇంకా తెలియడం లేదు. ఈ వైరస్ ఏంటో.. దానికి చికిత్స ఏంటో తెలియకుండా ముందుకు ఎలా వెళ్తామని సిబ్బంది అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎబోలా బాధితులకు చికిత్స చేసిన నర్సులు, వైద్యులు కొంతమందికి కూడా ఆ వ్యాధి సోకడంతో ఇప్పుడు ఈ బాధితుడికి చికిత్స చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. -
లైబీరియాలో భారతీయుడి ప్రాణం తీసిన ఎబోలా
ముంబై:లైబీరియాలో ఎబోలా సో్కి ఒక భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బుధవారం ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నఅమీర్.. గత నెల సెప్టెంబర్ 7వ తేదీన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతని మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లైబీరియా నుంచి వచ్చిన మరో భారత వ్యక్తికి ఎబోలా సోకింది. ఈ నెల 10వ తేదీన లైబీరియా నుంచి భారత్ కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు ఢిల్లీ విమానాశ్రయంలో గుర్తించారు. అంతకుముందు లైబీరియాలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు లేవని తేలింది. అయితే వీర్యం నమూనాల పరీక్షలో ఎబోలా లక్షణాలు కనిపించడం తో అధికారులు అతన్ని విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదే దేశంలో నమోదైన తొలి కేసుగా భావిస్తున్నారు. మరోవైపు భారత్లో ఎబోలా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. -
దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు!
న్యూఢిల్లీ: లైబీరియా నుంచి వచ్చిన ఓ భారతీయుడికి ఎబోలా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన లైబీరియానుంచి వచ్చిన ఈ యువకుడికి ఢిల్లీ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో చికిత్స అందిస్తున్నారు. లైబీరియాలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు లేవని, అయితే వీర్యం నమూనాల పరీక్షలో ఎబోలా లక్షణాలు కనిపించడం తో అధికారులు అతన్ని విడిగా ఉంచి, చికిత్స అందిస్తున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. అయితే, చెమట, వీర్యం వంటి అతని శారీరక ద్రవాలపై ఎబోలా వైరస్ ప్రభావంలేదని నిర్ధారణ జరిగేవరకూ అతన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే పర్యవేక్షణలో ఉంచుతామని అధికారులు తెలిపారు. కాగా, రాజస్థాన్లో 35ఏళ్ల మరో వ్యక్తిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతన్ని జైపూర్లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు జరిపారు.