
లైబీరియాలో భారతీయుడి ప్రాణం తీసిన ఎబోలా
ముంబై:లైబీరియాలో ఎబోలా సో్కి ఒక భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బుధవారం ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నఅమీర్.. గత నెల సెప్టెంబర్ 7వ తేదీన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతని మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లైబీరియా నుంచి వచ్చిన మరో భారత వ్యక్తికి ఎబోలా సోకింది. ఈ నెల 10వ తేదీన లైబీరియా నుంచి భారత్ కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు ఢిల్లీ విమానాశ్రయంలో గుర్తించారు. అంతకుముందు లైబీరియాలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు లేవని తేలింది. అయితే వీర్యం నమూనాల పరీక్షలో ఎబోలా లక్షణాలు కనిపించడం తో అధికారులు అతన్ని విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదే దేశంలో నమోదైన తొలి కేసుగా భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లో ఎబోలా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.