న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా వెనక్కి తీసుకువస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో దుబాయ్ నుంచి గురువారం ఐదు విమానాలు ప్రయాణీకులతో భారత్ బయల్దేరనున్నాయి. ఈ విషయాన్ని దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించారు. ఈ విమానాల ద్వారా దాదాపు 900 మంది స్వదేశానికి చేరుకోనున్నారని వెల్లడించారు. కాగా ఈ ఐదు విమానాలు కొచ్చి, కన్నూర్, కోజికోడ్, హైదరాబాద్, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నాయి.(వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’)
ఇక లాక్‌డౌన్ అమల్లో ఉన్న తరుణంలో అమెరికా, ఫిలిప్పైన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, సౌదీ అరేబియా, ఖతార్, సింగపూర్, దుబాయ్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ తదితర 13 దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాయు, సముద్ర మార్గాల ద్వారా దాదాపు 14,800 మందిని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించింది. మే 7 నుంచి ప్రారంభమైన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటికే చాలా మంది ప్రజలు భారత్‌కు చేరుకున్నారు.
Five flights operated from Dubai to Kochi, Kannur, Kozhikode, Hyderabad, and Trivandrum today carrying more than 900 passengers back to India: Consulate General of India, Dubai #VandeBharatMission pic.twitter.com/2XiUhb3qHL
— ANI (@ANI) May 28, 2020
Comments
Please login to add a commentAdd a comment