ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కొన్నిచోట్ల ఊహించినట్లుగానే రాగా.. తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పశ్చిమబెంగాల్‌లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోంది. దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీకి దగ్గరగా ఉంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్ గొగోయ్‌ను కాదని, బీజేపీ నేత శర్వానంద సోనోవాల్‌కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్ చాందీని దించి, ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..
పశ్చిమబెంగాల్ (294) | ||
పార్టీ | గెలుపు | 2011 ఫలితాలు |
టీఎంసీ | 211 | 184 |
లెఫ్ట్ | 76 | 62 |
బీజేపీ | 6 | |
ఇతరులు | 1 |
అసోం (126) | గెలుపు | 2011 ఫలితాలు |
బీజేపీ | 86 | 05 |
కాంగ్రెస్ | 26 | 79 |
ఏఐయూడీఎఫ్ | 13 | 18 |
ఇతరులు | 1 |
తమిళనాడు (234) | ఆధిక్యం | గెలుపు |
అన్నాడీఎంకే | 02 | 131 |
డీఎంకే | 02 | 97 |
ఇతరులు | 0 | 0 |
డీఎండీకే | 0 | 0 |
కేరళ (140) | ఆధిక్యం | గెలుపు |
ఎల్డీఎఫ్ | 0 | 88 |
యూడీఎఫ్ | 1 | 50 |
బీజేపీ | 0 | 1 |
ఇతరులు | 0 | 0 |
పుదుచ్చేరి (30) | గెలుపు | 2011 ఫలితాలు |
కాంగ్రెస్ | 17 | 07 |
ఏఐఎన్ఆర్‌సీ | 8 | 15 |
అన్నాడీఎంకే | 4 | 05 |
ఇతరులు | 1 | 03 |