‘విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వకూడదు’ | 'Foreign courts should not give divorce' | Sakshi
Sakshi News home page

‘విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వకూడదు’

Published Mon, Aug 21 2017 1:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

‘విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వకూడదు’

‘విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వకూడదు’

ముంబై: భారతీయ దంపతులు విదేశాల్లో నివసిస్తున్నంత మాత్రాన వారికి విడాకులు మంజూరు చేసే పరిధి సదరు దేశాల్లోని కోర్టులకు లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. దుబాయ్‌లో ఉంటున్న ఓ భారతీయుడికి అక్కడి కోర్టు అతని భార్య నుంచి విడాకులు ఇచ్చిన కేసును విచారిస్తూ కోర్టు ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసింది.

‘హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న భారతీయ జంటలకు సంబంధించిన కేసులను విచారించే పరిధి విదేశీ కోర్టులకు లేదని చట్టం పేర్కొంటోంది’ అని జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ అనుజా ప్రభుదేశాయ్‌ల ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో భార్యాభర్తలిద్దరూ భారతీయులేననీ, పుట్టుకతోనే హిందువులై, హిందూ వేద హక్కుల ప్రకారం పెళ్లిచేసుకుని, హిందూ వివాహ చట్టం పరిధిలోకి వస్తున్నారని కోర్టు తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement