పెళ్లికని వచ్చి శవమై తేలింది..! | Foreign Woman Found Dead In Delhi Hotel | Sakshi
Sakshi News home page

పెళ్లికని వచ్చి శవమై తేలింది..!

Nov 16 2019 9:51 PM | Updated on Nov 16 2019 10:04 PM

Foreign Woman Found Dead In Delhi Hotel - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శనివారం ఉదయం అన్నే వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడివుంది. అది గమనించిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ హోటల్‌ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా

న్యూఢిల్లీ : భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుందామని వచ్చిన ఓ జంటకు తీవ్ర విషాదం మిగిలింది. మహిళ అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. న్యూజిలాండ్‌కు చెందిన తుయల్లి పాలీ అన్నే(49), ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీ వచ్చారు. పహర్‌గంజ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని.. వారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అయితే, శనివారం ఉదయం అన్నే వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడివుంది. అది గమనించిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ హోటల్‌ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అన్నే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అన్నే హైపర్‌ టెన్షన్‌ రోగి కావడంతో.. కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె మృతికి కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement