delhi hotel
-
‘చాలా కోపంగా ఉన్నాం.. చైనా వాళ్లకు ఇవ్వం’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా దేశస్థులకు వసతి కల్పించబోమని తాజాగా ఢిల్లీ హోటల్ అండ్ రెస్టరెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ (డీహెచ్‌ఆర్‌ఓఏ) ప్రకటించింది. తమ హోటళ్లు, అతిథి గృహాల్లో చైనీయులకు చోటు కల్పించబోమని గురువారం స్పష్టం చేసింది. డీహెచ్‌ఆర్‌ఓఏలో సభ్యత్వం కలిగిన దాదాపు 3 వేల బడ్జెట్ హోటళ్లలో మొత్తం 75 వేల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, చైనా వస్తువులు, సరుకులు విక్రయించబోమని భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) ఇప్పటికే ప్రకటించింది. ఈనెల 15న సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు అమరులు కావడంతో చైనా వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. చైనా ఉత్పత్తులు ఉపయోగించం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు హోటళ్ల వ్యాపారంపైనా పడింది. దేశ రాజధానిలో హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. చైనా పౌరులకు గదులు అద్దెకు ఇవ్వకూడదన్న తమ నిర్ణయాన్ని అన్ని హోటళ్లు పాటిస్తాయన్న విశ్వాసాన్ని డీహెచ్‌ఆర్‌ఓఏ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వ్యక్తం చేశారు. ‘భారత్ పట్ల చైనా వ్యవహరించిన తీరు పట్ల ఢిల్లీ హోటల్ వ్యాపారవేత్తలలో చాలా కోపం ఉంది. దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ సాగిస్తున్న ప్రచారంలో ఢిల్లీ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులు భాగస్వాములు అయ్యారు. నగరంలోని బడ్జెట్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో చైనా జాతీయులకు వసతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నామ’ని గుప్తా తెలిపారు. తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. (చైనా మైండ్ గేమ్‌కు ఇదే నిదర్శనం) డీహెచ్‌ఆర్‌ఓఏ తీసుకున్న నిర్ణయాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన వారంతా మద్దతు పలుకుతున్నారని దీని ద్వారా స్పష్టమైందన్నారు. రవాణాదారులు, రైతులు, హాకర్లు, చిన్న తరహా పరిశ్రమలు, వినియోగదారులకు చెందిన జాతీయ సంఘాలను కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. (చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!) -
పెళ్లికని వచ్చి శవమై తేలింది..!
న్యూఢిల్లీ : భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుందామని వచ్చిన ఓ జంటకు తీవ్ర విషాదం మిగిలింది. మహిళ అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. న్యూజిలాండ్‌కు చెందిన తుయల్లి పాలీ అన్నే(49), ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీ వచ్చారు. పహర్‌గంజ్‌లోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని.. వారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, శనివారం ఉదయం అన్నే వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడివుంది. అది గమనించిన ఆమె బాయ్‌ఫ్రెండ్ హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అన్నే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అన్నే హైపర్ టెన్షన్ రోగి కావడంతో.. కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె మృతికి కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం: 17 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా అకస్మాత్తుగా మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. హోటల్లోని నాలుగు, ఐదు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. ప్రమాద సమయంలో హోటల్లోని 65 గదుల్లో దాదాపు 150 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ వ్యక్తి భవనం పైనుంచి కిందకు దూకేశాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక శిశువు కూడా ఉన్నారు. మంటల నుంచి తప్పించుకునేక్రమంలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి కిటికీ లోంచి దూకడంతో వీరిద్దరూ మృత్యువాత పడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 35 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి 26 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. -
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
-
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఎంతో ఉద్వేగమవుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీ కలర్‌ఫుల్ సెలబ్రేషన్స్ నిమగ్నమైంది. వారి సెలబ్రేషన్స్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు. ఈ తీర్పు ఢిల్లీలోని లలిత్ హోటల్‌కు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి స్టాఫ్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎందుకంటే, లలిత్ గ్రూప్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ సురి, ప్రముఖ ఎల్జీబీటీ కార్యకర్త. ఇంధ్రదనస్సు రంగుల్లో ఉన్న స్కార్ఫ్‌ను మెడలో, చేతికి ధరించి, హోటల్ స్టాఫ్ డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఇతరులను కూడా భాగస్వాములు కావాలని, హోటల్ స్టాఫ్ కోరారు. దీనిపై పనిచేసిన న్యాయవాదులందరికీ, జడ్జీలకు కృతజ్ఞతలని కేశవ్ సురి అన్నారు. పండుగ చేసుకోవడానికి ఇది చాలా పెద్ద సమయమని ఆనందం వ్యక్తం చేశారు. సెక్షన్ 377 కేసులో కేశవ్ సురి కూడా ఫిర్యాదుదారు. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377పై కీలక వ్యాఖ్యలు చేసింది. చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లుగా) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. -
సునందా 'పోస్ట్ మార్టమ్' వ్యాఖ్యలపై కట్టుబడే ఉన్నా
న్యూఢిల్లీ: మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నట్లు అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించడంతో సుధీర్ గుప్తా పెదవి విప్పారు. 'నేను ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా.అసలు నా మీద ఒత్తిడి తీసుకురాలేదని వారు ఎలా తెలుపుతారు? ఆ విషయం ఎయిమ్స్ బృందానికి ఎలా తెలుస్తుంది. ఒకవేళ ఎటువంటి తప్పు జరగపోతే వారు ఎందుకు ఆగమేఘాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు?' అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నించారు. సుధీర్ గుప్తా సంచలన ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించిన సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు వెల్లడించారు. -
సునందాది సహజ మరణం కాదా?
-
సునంద మృతిని 'సహజం'గా చెప్పాలన్నారు!!
సునందా పుష్కర్ మృతిని 'సహజం'గా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. సాక్షాత్తు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధినేతపైనే ఈ మేరకు ఒత్తిళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి ఆయన నేతృత్వం వహించారు. నాటి కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ ఈ సంవత్సరం జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రాత్రి 8 గంటలకు ఏఐసీసీ సమావేశం నుంచి తిరిగొచ్చిన తర్వాత శశిథరూర్ ఆమె మృతదేహాన్ని చూశారు. అయితే.. ఆమె మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డ్రగ్ పాయిజనింగ్ వల్లనే ఆమె మరణించారని, అది ఆత్మహత్య అయినా కావచ్చు, లేదా కావాలనే ఆమెకు ఆ మందు ఇచ్చి ఉండొచ్చని తాను ఇచ్చిన నివేదికకే కట్టుబడి ఉండటంతో ఇప్పుడు తనను టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాగా, సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం పెద్దది కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు.