మాజీ సీఎంకు గాయాలు | Former Assam CM Prafulla Kumar Mahanta sustained minor injuries | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంకు గాయాలు

Published Wed, Feb 10 2016 8:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

ప్రపుల్ల కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం - Sakshi

ప్రపుల్ల కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న కారు నాగాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. నిలిపివుంచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రపుల్లకుమార్ కుమారుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు.

వీరందరినీ నాగాన్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని సన్నిహితులు తెలిపారు. ప్రపుల్ల కుమార్... గువాహటి నుంచి తన నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడి కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement