Nagaon
-
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
ఆగని అఘాయిత్యాలు.. ట్యూషన్ నుంచి వస్తుండగా బాలికను అడ్డగించి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్‌కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్‌లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్‌లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
సరిహద్దులో పాక్ బరితెగింపు.. తిప్పికొట్టిన భారత్
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా పాక్ దుశ్చర్యలను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. భారత సైనిక పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాయాది కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద పాకిస్థాన్ సైన్యం మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. పూంచ్ సెక్టార్ ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ చనిపోగా, మరో సైనికుడు గాయపడ్డాడు. పాక్ సైన్యం కాల్పుల్లో గాయపడిన సైనికులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. అటువైపున కూడా ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పాక్ కవ్వింపు చర్యలకు గట్టి జవాబిస్తోంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కేవలం తొమ్మిది నెలల్లోనే 3,600 సార్లు కాల్పులకు తెగబడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందానికి పాకిస్థాన్ తరుచూ తూట్లు పొడుస్తూనే ఉంది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత నుంచి దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులను దేశంలోకి పంపి విధ్వంసం సృష్టించేందుకు దాయాది చేయని ప్రయత్నం లేదు. అయితే, వీటిని సైనికులు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. (చదవండి : బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!) -
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
నాగావ్: గౌహతి నుంచి ఈటానగర్ కు బయలు దేరిన ఎమ్ ఐ 17 హెలికాప్టర్ అత్యవసరంగా అసోంలోని నాగావ్ లో ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ నుంచి ఇంధనం లీకవుతుండటం పైలట్ గుర్తించిడమే ఇందుకు కారణం. ఇందులో ఇద్దరు ప్రయాణీకులతో పాటు ఆరుగురు స్కైవన్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఉన్నారు. స్కైవన్ ఎయిర్ వేస్ సంస్థ గౌహతి నుంచి ఈటానగర్ కు 290 కి.మీ మేర సర్వీసును అందిస్తుంది. 2011 ఏప్రిల్ లో ఎమ్ ఐ-17 హెలికాప్టర్ తవాంగ్ లో ప్రమాదానికి గురైంది. ఇందులో 17 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి ప్రయాణీకులను తరలింరాదని ఈ సర్వీసులపై డీజీసీఏ నిషేధం విధించింది. అరుణాచల్ ప్రదేశ్ దివంగత సీఎం దోర్జీ ఖండూ సైతం చాపర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలో వాతావరణం ఆకాశ ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. -
మాజీ సీఎంకు గాయాలు
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న కారు నాగాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. నిలిపివుంచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రపుల్లకుమార్ కుమారుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు. వీరందరినీ నాగాన్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని సన్నిహితులు తెలిపారు. ప్రపుల్ల కుమార్... గువాహటి నుంచి తన నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడి కాలేదు. -
అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి
అసోం: అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం అసోంలోని నగాన్ లో చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. అసోం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లక్ష్మీపూర్ జిల్లా నుంచి గౌహతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు.