మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి హన్స్రాజ్ భరద్వాజ్.. 2జీ స్పెక్ట్రం కుంభకోణం విషయంలో యూపీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2జీ కేటాయింపుల విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందునే అప్పట్లో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.
అలాగే.. అవినీతి ఆరోపణలపై 2007లో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అయితే కోర్ కమిటీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని భరద్వాజ్ తెలిపారు.