బీజేపీ నేతలకు నన్ను కలిసే ధైర్యం లేదు | no have dare to meet my self: in bjp | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలకు నన్ను కలిసే ధైర్యం లేదు

Published Mon, Jan 13 2014 4:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీ నేతలకు నన్ను కలిసే ధైర్యం లేదు - Sakshi

బీజేపీ నేతలకు నన్ను కలిసే ధైర్యం లేదు

 అవినీతి అంశంపై కర్ణాటక గవర్నర్ భరద్వాజ్
 తుమకూరు(కర్ణాటక), న్యూస్‌లైన్: బీజేపీ నాయకులకు అవినీతి అంశంపై తనను కలిసే ధైర్యం లేదని కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను అత్యంత శక్తిమంతులైన ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా వ్యవహరించాన న్నారు. ఆదివారం తుమకూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన తర్వాత విలేకర్ల మాట్లాడారు.
 
 అవినీతి ఆరోపణలున్న డీకే శివకుమార్, రోషన్ బేగ్‌లను కర్ణాటక కేబినెట్ నుంచి తప్పించాలన్న బీజేపీ డిమాండ్‌ను విలేకర్లు ప్రస్తావించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఇప్పుడు అవినీతిపై ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ... ‘నేనెప్పుడూ రబ్బరు స్టాంపులా పనిచేయలేదు. మంత్రిగా, ఎంపీగా, లాయర్‌గా ఉన్నప్పుడూ నిక్కచ్చిగానే ఉన్నా’ అని పేర్కొన్నారు. అవినీతి అంశంపై బీజేపీ నేతలు సహా ఎవరైనా  సరే తనతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement