hr bharadwaj
-
మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి హన్స్‌రాజ్ భరద్వాజ్.. 2జీ స్పెక్ట్రం కుంభకోణం విషయంలో యూపీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2జీ కేటాయింపుల విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందునే అప్పట్లో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. అలాగే.. అవినీతి ఆరోపణలపై 2007లో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అయితే కోర్ కమిటీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని భరద్వాజ్ తెలిపారు. -
అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్
-
అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్ రాజ్ భరద్వాజ్ తీవ్రంగా మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ సర్కారు ప్రతిష్టకు తీవ్ర భంగపాటు కలగడానికి చిదంబరమే వైఖరే ప్రధాన కారణమన్నారు. యూపీఏ హయాంలో 2జీ స్కాం దర్యాప్తును చిదంబరం పూర్తిగా వ్యతిరేకించడం వల్లే మన్మోహన్ సర్కారుపై మాయని మచ్చ పడిందని భరద్వాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2జీ స్టెక్ట్రామ్ కు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరం సరైన రక్షణ చర్యలు తీసుకుని ఉంటే ఆ స్కాం సంభవించి ఉండేది కాదని భరద్వాజ్ తెలిపారు. ఆ వ్యవహారంలో చిదంబరం వైఖరి కారణంగానే మన్మోహన్ సర్కారు ప్రతిష్ట దెబ్బతిందన్నారు. దేశానికి విశేషమైన సేవలందించిన మన్మోహన్ నిజాయితీని ఎప్పటికీ శంకిచలేమని భరద్వాజ్ స్పష్టం చేశారు. గతంలో కర్ణాటక గవర్నర్ గా పని చేసిన భరద్వాజ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది. -
బీజేపీ నేతలకు నన్ను కలిసే ధైర్యం లేదు
అవినీతి అంశంపై కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ తుమకూరు(కర్ణాటక), న్యూస్‌లైన్: బీజేపీ నాయకులకు అవినీతి అంశంపై తనను కలిసే ధైర్యం లేదని కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను అత్యంత శక్తిమంతులైన ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా వ్యవహరించాన న్నారు. ఆదివారం తుమకూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన తర్వాత విలేకర్ల మాట్లాడారు. అవినీతి ఆరోపణలున్న డీకే శివకుమార్, రోషన్ బేగ్‌లను కర్ణాటక కేబినెట్ నుంచి తప్పించాలన్న బీజేపీ డిమాండ్‌ను విలేకర్లు ప్రస్తావించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఇప్పుడు అవినీతిపై ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ... ‘నేనెప్పుడూ రబ్బరు స్టాంపులా పనిచేయలేదు. మంత్రిగా, ఎంపీగా, లాయర్‌గా ఉన్నప్పుడూ నిక్కచ్చిగానే ఉన్నా’ అని పేర్కొన్నారు. అవినీతి అంశంపై బీజేపీ నేతలు సహా ఎవరైనా సరే తనతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చన్నారు.