అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్ | Bharadwaj attacks Chidambaram on handling of 2G spectrum issue | Sakshi
Sakshi News home page

అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్

Published Tue, Nov 11 2014 10:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్

అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్ రాజ్ భరద్వాజ్ తీవ్రంగా మండిపడ్డారు.  మన్మోహన్ సింగ్ సర్కారు ప్రతిష్టకు తీవ్ర భంగపాటు కలగడానికి చిదంబరమే వైఖరే ప్రధాన కారణమన్నారు. యూపీఏ హయాంలో 2జీ స్కాం దర్యాప్తును చిదంబరం పూర్తిగా వ్యతిరేకించడం వల్లే మన్మోహన్ సర్కారుపై మాయని మచ్చ పడిందని భరద్వాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 

2జీ స్టెక్ట్రామ్ కు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరం సరైన రక్షణ చర్యలు తీసుకుని ఉంటే ఆ స్కాం సంభవించి ఉండేది కాదని భరద్వాజ్ తెలిపారు. ఆ వ్యవహారంలో చిదంబరం వైఖరి కారణంగానే మన్మోహన్ సర్కారు ప్రతిష్ట దెబ్బతిందన్నారు. దేశానికి విశేషమైన సేవలందించిన మన్మోహన్ నిజాయితీని ఎప్పటికీ శంకిచలేమని భరద్వాజ్ స్పష్టం చేశారు. గతంలో కర్ణాటక గవర్నర్ గా పని చేసిన భరద్వాజ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement