సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందీపొర జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై సోమవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు.
వివరాలు.. సంబల్‌లోని 45వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ముందుగా సెంట్రీ పోస్ట్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కౌంటర్ ఎటాక్ చేపట్టాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి ఏకే 47 తుపాకులతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రణాళికతో ఉగ్రవాదులు క్యాంప్‌పై దాడి చేశారని అధికారులు తెలిపారు. కశ్మీరులో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్‌కు చెందిన నేతలు, వ్యాపారుల సంస్థలు, నివాసాలలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.