గూర్గావ్: వచ్చే ఐదేళ్లలో భారత్లో సౌర విద్యుత్ అభివృద్ధికి 300 మిలియన్ల యూరోలను(రూ.22,01,08,85,116.39) కేటాయించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. సోమవారం గుర్గావ్లో అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్ఏ) హెడ్ క్వార్టర్స్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.
'ది ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ 300 మిలియన్ల యూరోలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సహాయంగా అందించనుంది. ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తామని భారత్ గతంలో అబుదాబిలో జరిగిన సమావేశంలో చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ పని వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా ప్రారంభం కావాలి. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం తమ వంతుగా అందిస్తాం' అని హోలాండ్ తెలిపారు. ఐఎస్ఏ కార్యక్రమాన్ని గతంలోనే ప్రధాని మోదీ, హోలాండే నవంబర్ 30న పారిస్ వాతావరణ సదస్సు సందర్భంగా ప్రారంభించారు. ఇందులో దాదాపు 120 దేశాలు భాగస్వామ్యం కానున్నాయి.
సోలార్ కోసం ఫ్రాన్స్ 300 మిలియన్ యూరోలు
Published Mon, Jan 25 2016 5:01 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement