విద్యార్థినిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ | gang rape on a student in maharashtra | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ఐదుగురు గ్యాంగ్ రేప్

Published Mon, Feb 29 2016 6:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థినిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ - Sakshi

విద్యార్థినిపై ఐదుగురు గ్యాంగ్ రేప్

నాగపూర్: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు కలిసి నాగపూర్లో పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వాథోడాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి తెగబడిన వారిలో నలుగురు మైనర్లే ఉన్నారు. విద్యార్థినిని భయపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. తదనంతరం ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రాహుల్ నాందేవ్ వాదవే(19)తోపాటు నలుగురు మైనర్లపై కేసు నమోదుచేశారు. మైనర్లను జువైనల్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement