గెజిటెడ్ ఆఫీసర్లు సర్టిఫై చేస్తేనే నమ్మాలా?
మనవాళ్లను మనం నమ్మకపోతే పక్కవాళ్లను నమ్ముతామా అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాస్పోర్టుల కోసం, ఇంకా వివిధ రకాల పనులకు గెజిటెడ్ అధికారుల వద్ద సంతకాలు చేయించుకునే సంస్కృతికి ఇక కాలం చెల్లాల్సిందేనని అన్నారు.
అవతల ఎవరో సర్టిఫై చేస్తేనే మనవాళ్ల నిజాయితీని నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటారని, ఇకమీదట అలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. 125 కోట్ల మంది భారతీయుల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే గెజిటెడ్ అధికారుల సంతకాల అవసరాన్ని పూర్తిగా తప్పించానని చెప్పారు.