ఓ విద్యార్థిని ప్రేమ నాటకం | girl false complaints against her lover | Sakshi
Sakshi News home page

ఓ విద్యార్థిని ప్రేమ నాటకం

Published Fri, Jan 8 2016 8:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ఓ విద్యార్థిని ప్రేమ నాటకం - Sakshi

ఓ విద్యార్థిని ప్రేమ నాటకం

చెన్నై: ప్రేమించిన విద్యార్థి మాట్లాడడం లేదనే కోపంతో.. ముగ్గురు విద్యార్థులు కత్తితో గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ విద్యార్థిని నాటకం బయటపడింది. చెన్నై, పురసైవాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న ఓ అమ్మాయి.. తనను ప్లస్‌టూ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కత్తితో పొడిచినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ అమ్మాయిని ముగ్గురు విద్యార్థులు ప్రేమించారని, ప్రేమ విషయంలో వారి మధ్య గొడవ జరిగిందని, పాఠశాలకు వెళుతున్న సమయంలో ముగ్గురు కలసి.. ఆమెను అడ్డుకుని కత్తితో దాడి చేసినట్టు వార్తలు రావడం సంచలనం కలిగించింది. ఇన్‌స్పెక్టర్ ప్రభు ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టారు. విద్యార్థిని కుడి చేతిపై ఉన్న గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. ఎవరో చేసిన గాయం కాదని, హెయిర్‌పిన్‌లో గీచుకున్నట్టు ఉందని తెలిపారు. దీంతో గురువారం పోలీసులు.. విద్యార్థినిని ఆమె చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విచారించారు.

 

పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తాను ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని, కొన్ని నెలలుగా ఆ అబ్బాయి మాట్లాడకపోవడంతో కక్ష సాధింపు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. హెయిర్ పిన్‌తో తన చేతిని గాయపరచుకుని నాటకం ఆడినట్టు ఒప్పుకుంది. పోలీసులు ఆ విద్యార్థిని మందలించి పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement