పరీక్షలు రాసిన పెళ్లికూతురు! | Girl takes exams in bridal dress | Sakshi
Sakshi News home page

పరీక్షలు రాసిన పెళ్లికూతురు!

Published Thu, Mar 12 2015 5:04 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

పరీక్షలు రాసిన పెళ్లికూతురు!

పరీక్షలు రాసిన పెళ్లికూతురు!

ఓ అమ్మాయికి ఆరోజే పెళ్లయింది. కానీ అదేరోజు పరీక్ష కూడా ఉంది. ఇటు జీవితంలో పరీక్ష, అటు పుస్తకాల పరీక్ష.. దేన్నీ వదులుకోవడం కుదరదు. అందుకే.. పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి దుస్తుల్లోనే నేరుగా వచ్చి బీఏ మొదటి సంవత్సరం పరీక్ష రాసేసింది. పరీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొంది.

రాజస్థాన్లోని బలేశ్వర్ ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రజాపత్కు సోమవారం రాత్రి పెళ్లయింది. అప్పగింతల కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. అయితే.. మంగళవారమే ఆమెకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష కూడా ఉంది. దానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. సంతోష్ మాత్రం తనకు పరీక్ష ఉందని, అందువల్ల అది అయిపోయిన తర్వాత పరీక్ష రాస్తానని పెళ్లివాళ్లను కోరింది. ఎలాగోలా వాళ్లను నానా తంటాలు పడి ఒప్పించి.. చివరకు పెళ్లి దుస్తులతోనే పరీక్ష రాసింది. ఆ పరీక్ష రాయకపోతే.. విద్యాసంవత్సరం మొత్తం వృథా అవుతుందనే తాను వాళ్లను ఒప్పించి పరీక్ష రాసినట్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement