లిక్కర్ బాటిల్తో స్టాలిన్ ముందుకు యువతి | Girl waves liquor bottle at Stalin, seeks prohibition | Sakshi
Sakshi News home page

లిక్కర్ బాటిల్తో స్టాలిన్ ముందుకు యువతి

Published Wed, Nov 4 2015 5:43 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

లిక్కర్ బాటిల్తో స్టాలిన్ ముందుకు యువతి - Sakshi

లిక్కర్ బాటిల్తో స్టాలిన్ ముందుకు యువతి

వెల్లూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్కు ఓ యువతి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కంటినిండా నీరుతో గద్గద స్వరంతో చేతిలో బీరు బాటిల్ పట్టుకొని ఊపుతూ ఆమె తన ఆవేదనను వెల్లిబుచ్చింది. వెల్లూరులో ఆయన బుధవారం 'నమక్కు నామే' అనే ఓ ప్రచార కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఆ యువతి లిక్కర్ బాటిల్ తో ఆయన ముందుకు వచ్చింది.

మద్యం మహామ్మారి తన తండ్రిని పొట్టన పెట్టుకుందని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మద్యాన్ని మాన్పించలేకపోతున్నారని, ఫలితంగా తమలాంటి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ సారి డీఎంకే ప్రభుత్వమైనా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇవ్వాలని చెప్పింది. ఇందుకు స్పందించిన స్టాలిన్.. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, తమ అజెండాలో ఆ అంశం కూడా ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement