14 లక్షల కొత్త ఈవీఎంల కొనుగోలు | GoM backs EC proposal to buy 14 lakh EVMs | Sakshi
Sakshi News home page

14 లక్షల కొత్త ఈవీఎంల కొనుగోలు

Published Thu, Apr 28 2016 1:55 PM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM

GoM backs EC proposal to buy 14 lakh EVMs

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు 2019 సార్వత్రిక ఎన్నికలకోసం 14 లక్షల కొత్త ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లను కొనాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ బృందం సిఫార్సులు చేసింది. వీటికోసం రూ.5,000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నారు.

ఈ మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. 2015-16 నుంచి 2018-19 మధ్య దశలవారీగా వీటిని కొంటారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటిలో 9 లక్షలకు పైగా ఈవీఎంలు 2019 ఎన్నికల నాటికి పనికిరావు. ఈవీఎంలను బెంగళూరులోని బీఈఎల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లు తయారుచేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement