హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలివిడత 146 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. 10 నగర పాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లకు పోటీ ఏర్పడింది. ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి.
గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల కమిషన్ త్వరలోనే ఎన్నికలు నిర్వహించనుంది. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) అందుబాటులో ఉండనున్నాయి.
కాగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
మార్చి 10: నామినేషన్ల స్వీకరణ
మార్చి 13: నగర పాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు
మార్చి 14: మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు గడవు
మార్చి 15: నామినేషన్ల పరిశీలన
మార్చి 18: నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 30: పోలింగ్
ఏప్రిల్ 2: ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
మున్సిపల్ నామినేషన్లు ప్రక్రియ షురూ
Published Mon, Mar 10 2014 2:19 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement