Ramakanth reddy
-
ముగిసిన మార్టూరు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు
ఒంగోలు: మార్టూరు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 2014 ఏప్రిల్ 6వ తేదీ తొలిదశలోనే మార్టూరులోని ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ జరిగినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై తాజాగా ఈనెల 5వ తేదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరిచి లెక్కించారు. వైఎస్సార్సీపీ 2 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా... టీడీపీ మిగిలిన నాలుగు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కౌంటింగ్‌కు రిటర్నింగ్ అధికారిగా జిల్లా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సాంబయ్య, మార్టూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. జిల్లా పరిషత్ సీఈవో ఏ.ప్రసాదు, డిప్యూటీ సీఈవో నర శింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంబేద్కర్ నగర్ ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి మురికిపూడి ప్రభుదాస్‌కు 794 ఓట్లురాగా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్ములూరి శ్యామలకు 715 ఓట్లు లభించాయి. దీంతో 79 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. గొట్టిపాటి నగర్ ప్రాదేశికంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బండి దాసుకు 777 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి దేవదాసుకి 715 ఓట్లు వచ్చాయి. దీంతో 62 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాండా ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి వేముల దిబ్బయ్య 146 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం రోడ్డు ప్రాదేశికానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడగా టీడీపీ అభ్యర్థి కారుసాల మాలింబి 70 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకుంది. రాంనగర్ ప్రాదేశికానికి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి కుమారి 45 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. జనార్థన్ కాలనీ ప్రాదేశికానికి రీకౌంటింగ్ జనార్థన్ కాలనీ ప్రాదేశికంలో మొత్తం ఓట్లు 2536. పోలైన వి 2097. వీటిలో 25 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. అర్హమైన ఓట్లు 2072. వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రమావత్ గౌరీభాయికి 1040 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బుజ్జిభాయి భూక్యాకు 1031 ఓట్లు లభించాయి. వీరితోపాటు ఈ ప్రాదేశికంలో స్వతంత్ర అభ్యర్థిగా మరియమ్మభాయి అంగోత్ పోటీపడ్డారు. ఆమెకు కేవలం ఒక్క ఓటే వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం 9 కావడం, మరో వైపు తిరస్కరణకు 25 ఓట్లు తిరస్కరణకు గురికావడంతో ఏజెంట్లు రీకౌంటింగ్ పెట్టాలంటూ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు తిరిగి రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. 19న మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక: ఈనెల 19న మార్టూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీనికిగాను ఈనెల 15న నోటిఫికేషన్ జారీచేయాలి. ఉదయం 10 గంటలలోగా కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తిచేయాలి. 12 గంటలకు అర్హత పొందిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించాలి. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఒంటిగంటకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా అభ్యర్థులచేత ప్రమాణస్వీకారం పూర్తి చేయించి కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి అభ్యర్థుల్ని సమావేశపరిచి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. -
రాజీవ్ శర్మతో రమాకాంత్ రెడ్డి భేటి!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి అనుసరించిన విధానాలపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమాకాంత్‌రెడ్డి భేటి అయ్యారు. రాజీవ్ శర్మతో భేటి తర్వాత రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు, సెగ్మెంట్ల వారిగా ఓటర్ల వివరాల గురించి చర్చించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, రిజర్వేషన్లు, డీ లిమిటేషన్ ఖరారు కోసం ప్రభుత్వానికి లేఖ రాశామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. -
గత ప్రభుత్వం వల్లే ఎన్నికల నిర్వహణ ఆలస్యం: ఈసీ
గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. రాష్టవ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూరైందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ... నిజమాబాద్ జిల్లా బండపల్లి, మైలారం ఎంపీటీసీ స్థానాలలో ఈ నెల 18న రీపోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న వారందరికి రమాకాంత్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే తూర్పు ఎర్రబెల్లిలో బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టాయని తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా మామిడాల ఎంపీటీసీ స్థానాల్లో బ్యాలెట్ బాక్సులు, పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ, నిడదవోలు ఎంపీటీసీ స్థానాల్లో బ్యాలెట్ బాక్స్‌లు తడిచాయని చెప్పారు. -
ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ
జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా వారికి ఓటు హక్కు లేదన్నారు. బుధవారం రమాకాంత్ రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలంటే ఆయా సమావేశాలలో పాల్గొనవచ్చని తెలిపారు. జడ్పీ, మండలపరిషత్త్ అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీలే పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. -
'స్లిప్‌లు, నోటు తడిచాయి.. చెదలు పట్టాయి'
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల ప్రజలు తమ నిరసనను బ్యాలెట్ బాక్సుల్లో చూపారు. * చిత్తూరు జిల్లా కలిగిరి మండలంలో ఓటర్లు గత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంచి నీళ్ళివ్వని మీకెందుకు ఓటేయాలంటూ.. స్లిప్‌లు రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కలిగిరి తాజా మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి సొంత మండలం కావడం విశేషం. *అనంతపురం జిల్లా నల్లచెర్వు జెడ్పీటీసీ కౌంటింగ్‌కు టీడీపీ ఏజెంట్‌గా రౌడీషీటర్ నాగభూషణం నాయుడు హాజరయ్యాడు. *అటు గుంటూరు జిల్లా కర్లపాలెంలో కూడా ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ పత్రంతో పాటు, ఓ పది రూపాయల నోటు కూడా బయట పడింది. కర్లపాలెం ఎంపిటిసిలో ఓటు వేసిన ఓ వ్యక్తి బ్యాలెట్ పత్రంతో పాటు, పది రూపాయల నోటు జత చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నోటు బయట పడింది. *నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్‌లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయి ఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. *ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో పాము ప్రత్యక్షం కావటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. *శ్రీకాకుళం జిల్లా పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద తేనెటీగలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్‌తో పాటు, 20మంది గాయపడ్డారు. *పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెనుగొండ మండలానికి చెందిన 3 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు తడిచి ముద్దయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. దీంతో కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుందోనని అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. *నిడదవోలు మండలంలో తాడిమళ్ల, కోరుమామిడి బ్యాలెట్ ఓట్లు తడవటంతో, లెక్కింపుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. *తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపూడి మండలంలో పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్స్ వర్షానికి తడిసిపోయింది. *రంగారెడ్డి జిల్లా తాండూరు కౌంటింగ్ కేంద్రంలో భోజనాలు అందలేదని సిబ్బంది కౌంటింగ్ నిలిపివేశారు. *కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద స్టాంగ్ రూమ్ తాళాన్ని సిబ్బంది పోగొట్టడంతో, అధికారులు తాళాలు పగులకొట్టి బ్యాలెట్ బాక్సులు బయటకు తీశారు. *నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం వడ్లూరు బ్యాలెట్ బాక్స్‌లో ఓ లెటర్ ప్రత్యక్షం అయ్యింది. అభ్యర్థులు నచ్చలేదని ఓ ఓటరు ఓటు బదులు బ్యాలెట్ బాక్స్‌లో లెటర్ వేశాడు. *ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లో కాజద్నగర్, కౌటాలా పోలింగ్ కేంద్రంలో భోజనం సదుపాయం కల్పించలేదని సిబ్బంది విధులు బహిష్కరించారు. -
'కౌంటింగ్‌కు వీలుకాకుంటే రీ పోలింగ్'
-
కౌంటింగ్‌కు వీలుకాకుంటే రీ పోలింగ్
హైదరాబాద్ : అకాల వర్షాలకు తడిచిన, చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో మూడుచోట్ల బ్యాలెట్ పేపర్లు తడిచాయని, అలాగే నెల్లూరు జిల్లాలో ఓ చోటు బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయన్నారు. ఒకవేళ లెక్కింపుకు వీలు కాకుంటే రీ పోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఈవీఎంలు తెరుచుకోలేదని వాటిని ఈసీఐఎల్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు. అవి ఓపెన్ కాకుంటే మళ్లీ రీపోలింగ్ జరుపుతామన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ-2, ఎంపీటీసీ-15 స్థానాల ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిని ఎప్పుడు నిర్వహించమంటే అప్పుడు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం లేదా రాత్రి వరకూ కొనసాగవచ్చునని ఆయన తెలిపారు. -
ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ తుదివిడత పోలింగ్
హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ తుదివిడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసాయి. స్వల్పఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 13న రీపోలింగ్ నిర్వహిస్తాం అని తెలిపారు. విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండలం బూసికుట్టులో మావోలు బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారని మీడియాకు తెలిపారు. బూసికట్టులో మాత్రం ఈనెల 16న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రమాకాంత్ రెడ్డి చెప్పారు. వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసాయని ఆయన తెలిపారు. -
బ్యాలెట్ పత్రాలు తారుమారు: రమాకాంత్ రెడ్డి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 15-20 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ నిలిచిపోయిన కేంద్రాల్లో ఈనెల 13వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. రెండు చోట్ల రీపోలింగ్ జరిపే అవకాశం ఉందని రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. చిన్న చిన్న ఘర్షణల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు .సాయంత్రం 5 గంటల వరకు అన్నిచోట్లా పోలింగ్ జరుగుతుందని, అందరూ సమైక్యంగా కృషి చేయడం వల్లే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు. -
నేడు తుది విడతస్థానిక సమరం
-
నేడు తుది విడతస్థానిక సమరం
* అసెంబ్లీ ఫలితాలకు రెండు మూడు రోజుల ముందే స్థానిక ఫలితాలు * పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్పర్సన్ల ఎన్నికలు * 536 జెడ్పీటీసీలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీలకు 25,621 మంది పోటీ * ఓటర్ల జాబితాలో పేరు లేనివారు పోలింగ్ కేంద్రాలకు రావద్దు: రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల తుది సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని సగం పల్లెల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడతలో 536 జడ్పీటీసీ స్థానాలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీ స్థానాలకు 25,621 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే రెండు మూడు రోజుల ముందుగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ముందుగా మున్సిపల్ ఫలితాలు, ఆ తరువాత ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. స్థానిక ఫలితాల తరువాత పరోక్ష పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు చైర్పర్సన్లు, వైస్-చైర్పర్సన్ల ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై గడువేమీ లేదని తెలిపారు. పరోక్ష ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల ముందు ఎన్నికైన సభ్యులకు నోటీసు ఇస్తే సరిపోతుందన్నారు. ఆయన గురువారం ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్, సంయుక్త కార్యదర్శి సత్య రమేష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయనేం చెప్పారంటే... * ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసే నాటికి ఓటర్ల జాబితాలో పేర్లున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. మార్చి 10 తరువాత ఓటర్ల జాబితాలో చేరిన వారు ఓటు వేయడానికి అనర్హులు. వారి పేరు స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉండదు. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు అనవసరంగా పోలింగ్ కేంద్రాలకు రావద్దు. పోలింగ్ సిబ్బందితో ఘర్షణ పడవద్దు. * ఓటరు స్లిప్పులు లేకపోయినా.. తాము ఇది వరకు జారీ చేసిన 21 ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని తీసుకుని వచ్చినా ఓటు వేయవచ్చు. * ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. * తుది విడత ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశాం. మొదటి విడతకు వినియోగించిన 95,031 సిబ్బందితోపాటు, అదనంగా 45 ప్లాటూన్ల ఎపీఎస్పీ, ఏసీబీ, విజిలెన్స్, జైలు, ట్రాన్స్‌కో పోలీసులు, అటవీ, ఎక్సైజ్ అధికారులను వినియోగిస్తున్నాం. * 25,758 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1.31 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 3,089 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తాం. 3,206 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, 5,078 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. * సున్నిత పోలింగ్ కేంద్రాలు 6057 ఉంటే, 6463 అతిసున్నిత, నక్సల్స్ ప్రభావిత కేంద్రాలు 558గా గుర్తించాం. నక్సల్స్ ప్రభావిత కేంద్రాల్లో సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ కొనసాగుతుంది. * స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ. 84.47 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.48 లక్షల కిలోల నల్లబెల్లం కూడా స్వాధీనం చేసుకున్నారు. -
'మున్సిపల్ లో ఓటు వేస్తే, పరిషత్ ఎన్నికలకు అనర్హులు'
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసినవారు గురువారం జరిగే పరిషత్ ఎన్నికలకు అనర్హులని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేపు నిర్వహించే తుది విడత పరిషత్ పోలింగ్‌కు సర్వం సిద్దం అని తెలిపారు. 536 జెడ్ పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఓటుహక్కు వినియోగించిందుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25,758 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 5,075 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్టు ఆయన తెలిపారు. ఎన్నికలలు నిర్వహించే ప్రదేశాల్లో 6,057 సమస్యాత్మక ప్రాంతాలుగా, 6,463 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
రేపే మలి విడత పరిషత్ ఎన్నికలు
-
80 శాతం పోలింగ్
మూడుచోట్ల 11వ తేదీన రీపోలింగ్ అక్కడక్కడ ఘర్షణలు మండుటెండలో విలవిల్లాడిన ఓటర్లు వృద్ధులు, వికలాంగులకు కానరాని ప్రత్యేక ‘క్యూ’లు 556 జెడ్పీటీసీ, 8,250 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతం: రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తొలిదశ ప్రాదేశిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు దాదాపు 80శాతంపైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. తొలిదశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. ప్రస్తుత సమాచారం మేరకు కేవలం మూడుచోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించనున్నామని, ఏప్రిల్ 11న రీపోలింగ్ జరుగుతుం దని చెప్పారు. 556 జెడ్పీటీసీ, 8,250 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ‘క్యూ’లో నిల్చున్న ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ఉదయం ఉత్సాహంగా సాగిందని, మధ్యాహ్నం ఎండ వేడిమి పెరిగిన కొద్దీ మందకొడిగా జరిగినా.. చివరి రెండు గంటల ముందు ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో అక్కడక్కడ తెలుగుదేశం-వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. పోలీసుల బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించడం వల్ల గొడవలు సద్దుమణిగాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎస్ఐ ఆత్మరక్షణార్థం గాలిలోకి కాల్పులు జరిపారని రమాకాంత్‌రెడ్డి తెలి పారు. కాగా పలుచోట్ల పోలీసులు లాఠీచార్జీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకు ముందే పోలింగ్ 80 శాతం దాటిపోయిందని, విశాఖపట్టణంలో పోలింగ్ మందకొడిగా జరిగిందని వివ రించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓడిగోళంలో ఒక కేంద్రం, నెల్లూరు జిల్లా కోవూరులోని ఒకటో పోలింగ్ కేంద్రం, మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని చెర్లగూడెంలో ఒకపోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 11న రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్లకు కనీస సౌకర్యాలు కరువు ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ఓటు వేయడానికి వచ్చినవారు క్యూలలో నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సదుపాయాలు లేకపోవడం గమనార్హం. దాంతో వారు ఎండకు విలవిలలాడారు. కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఎండ నుంచి ఉపశమనం కలిగించడానికి షామియానాలు కూడా వేయకపోవడం గమనార్హం. ఎండవేడిమిని తట్టుకోలేక నీడ లో నిల్చుని ఓట్లు వేద్దామని భావించిన ఓటర్లను పోలీసులు.. వెళ్లిపోండంటూ బెదిరించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. బ్యాలెట్ బాక్స్‌ల భద్రతకు సీసీ కెమెరాలు.. బ్యాలెట్ బాక్స్‌లను మొదట మండల కేంద్రాలకు తరలిస్తారని, సోమవారం వాటిని రెవెన్యూ డివిజనల్ పరిధిలో లేదా డీఎస్పీ కార్యాలయాలు ఉన్న చోటకు తరలిస్తారని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. అవసరం అనుకున్న ప్రాంతాల్లో మొత్తం బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రాలకు తరలిస్తారని ఆయన చెప్పారు. బాక్సుల రక్షణ కోసం అవసరమైనచోట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. -
70 నుంచి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు:రమాకాంత్ రెడ్డి
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ నమోదైన తీరును బట్టి చూస్తే 70 నుంచి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం జరిగే తొలి విడత ఎన్నికల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందన్నారు. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల పోలింగ్ సరళి కాస్త తగ్గిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 జడ్పీటీసీలు, 8250 ఎంపీటీసీలకు జరిగిన పోలింగ్ ముగిసిందన్నారు విశాఖ జిల్లాలో పోలింగ్ మందకోడిగా సాగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు మూడు జిల్లాలో రీ పోలింగ్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం లో ఒక చోట, నెల్లూరు జిల్లాలో నాలుగు చోట్ల, మెదక్‌లో ఒకచోట రీ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ పోలింగ్ ను ఈ నెల 11 వ తేదీన నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకే 80 శాతం పైగా పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. బ్యాలెట్ బాక్సులను ఉంచి స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని రమాకాంత్ రెడ్డి తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
15.22 శాతం పోలింగ్ నమోదు
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 15.22 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 18.2 శాతం, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారందరికీ రాత్రి 7, 8 గంటల వరకు కూడా ఓట్లు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ చాలా సజావుగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఈవీఎంల బ్యాటరీలు లీకైనా, వీకైనా వాటిని గమనించకుండా మిషన్ ఆన్ చేసిన చోటే అవి మొరాయించాయని, వాటిని కూడా వీలైనచోట్ల బాగు చేయించడం లేదా కొత్తవి అందించడం చేశామని రమాకాంత్ రెడ్డి చెప్పారు. వివిధ జిల్లాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పది గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం 17.31, విజయనగరం 14.93, విశాఖ 17.16, తూర్పుగోదావరి 15.85, పశ్చిమ గోదావరి 12.23, కృష్ణా 13.68, గుంటూరు 16.67, ప్రకాశం 17, నెల్లూరు 18.2, చిత్తూరు 16.43, అనంతపురం 15.57, కర్నూలు 10, కడప 15.05, వరంగల్ 12, కరీంనగర్ 14, ఖమ్మం 16.74, ఆదిలాబాద్ 11.94, రంగారెడ్డి 18.25, నల్గొండ 13, మెదక్ 18.05, మహబూబ్‌నగర్ 15.97, నిజామాబాద్ 13.88 శాతం పోలింగ్ నమోదైంది. -
నేడే మున్సి‘పోల్’
మున్సిపాలిటీలు145 కార్పొరేషన్లు 10 మొత్తం ఓటర్ల సంఖ్య 95,35,824 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ 3,959 వార్డులు, 513 డివిజన్లకు 21,207 మంది పోటీ 9,015 కేంద్రాలు.. 50,300 మంది సిబ్బంది.. 13,991 ఈవీఎంలు 3,630 సమస్యాత్మక, 3,026 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 53 వేల మందికి పైగా పోలీసు, పారా బలగాలతో భారీ బందోబస్తు 1,046 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 1,023 నిఘా బృందాల ఏర్పాటు 23,519 మందిపై కేసులు.. 2,44,101 మంది బైండోవర్ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఏం చెప్తే అది చేస్తాం: రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తం 145 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హైకోర్టు తీర్పు కారణంగా కర్నూలు జిల్లా బనగానపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలను వాయిదా వేశారు. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని.. ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఏప్రిల్ 1వ తేదీన ఏం చెప్తే అది చేస్తామని.. 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేయమంటే చేస్తామని, లేదు వాయిదా వేయమంటే వేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 2010 సెప్టెంబర్‌లో పాలక మండళ్ల గడువు ముగియడంతో.. అప్పటి నుంచి ఎన్నికలు జరుగకుండా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల మూడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటమూ విదితమే. ఆదివారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి రమాకాంతరెడ్డి వివరించిన ముఖ్యాంశాలివీ... ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 95,35,824 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 47,64,857 మంది ఉంటే.. మహిళలు 47,70,346 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 5,489 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో హిజ్రాలు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిజ్రాలు మొత్త 621 మంది ఓటర్ల జాబితాలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో మొత్తం 3,990 వార్డులు ఉంటే.. అందులో 39 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మిగిలిన 3,959 వార్డుల ఎన్నికల్లో 17,795 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 10 కార్పొరేషన్లలో మొత్తం 513 డివిజన్లకు ఎన్నికల్లో 3,343 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కోసం 10,087 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కోసం 3,814 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారు. 3,630 సమస్మాత్మక, 3,026 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో 3,002 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్, 4,919 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని వీడియోగ్రఫీ చేస్తారు. 1,656 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహణకు 36,500 మంది టీచర్లు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహణకు 13,800 మంది టీచర్లు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ప్రతి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా జిల్లాల్లోని పోలీసు సిబ్బందినే ఆయా మున్సిపాలిటీల్లో నియమించారు. ఇందుకు అదనంగా 41 మంది డీఎస్పీలు, 55 మంది ఎస్ఐలు, 130 ఏఎస్పీ ప్లాటూన్లు, 16 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియమించారు. ఎన్నికల నియామవళి అమలులో భాగంగా 23,519 మందిపై కేసులు నమోదు చేశారు. 2,44,101 మందిని బైండోవర్ చేశారు. 15,766 ఆయుధాలను డిపాజిట్ చేశారు. 201 ఆయుధాల లెసైన్స్‌లను రద్దు చేశారు. ఎక్సైజ్, పోలీసులు కలిపి 20,724 కేసులు నమోదు చేశారు. 7,483 మందిని అరెస్టు చేశారు. 1,79,422 లీటర్ల మద్యాన్ని, 3 లక్షల కేజీలకు పైగా నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 59.17 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నాగరాజు అనే కమిషనర్ విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ చేసి, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సాధనను నియమించారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు: డీజీపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాం తంగా జరగడానికి మొత్తం 53,370 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. ఇందులో 36 మంది అదనపు ఎస్పీలు, 206 మంది డీఎస్పీలు, 631 మంది ఇన్స్పెక్టర్లు, 2,053 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 9,048 ఏఎస్ఐలు, 33,168 మంది కానిస్టేబుళ్లు, రిజర్వు కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియోగించినట్లు వివరించారు. అలాగే 792 మంది మహిళా కానిస్టేబుళ్లు, 512 మంది మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు, 6,923 మంది హోగార్డులు కూడా బందోబస్తులో ఉన్నారని తెలిపారు. ‘‘మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. అయినా ఆ ఓటర్ల స్లిప్‌లను సమయం లేనందున ధృవీకరించలేదు. ఓటర్ గుర్తింపు కార్డు లేనివారు రేషన్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్ వంటి 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో కార్డు తీసుకువెళ్లి ఓటు వేయాలి. ఓటరు స్లిప్ కూడా తీసుకువెళితే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది త్వరగా మీ పేరు గుర్తించగలరు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తారు. ’’ - రమాకాంత్‌రెడ్డి -
మే7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు!
హైదరాబాద్: మున్సిపల్ ఫలితాల వాయిదాపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు వాయిదాపై ఏప్రిల్ 1వ తేదీన హైకోర్టు నిర్ణయం వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారంమే తాము వ్యవహరిస్తామని రమాకాంత్‌రెడ్డి ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మే 7 తర్వాతే వెల్లడిస్తామని ఆయన అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడించే తేదీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల తేది మార్పును సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 146 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లలో ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకూ పోలింగ్ జరుగుతుందని, మున్సిపాల్టీల్లో పదివేలకుపైగా ఈవీఎంల వాడతున్నామన్నారు. కార్పొరేషన్లలో 3814 ఈవీఎంలను, మున్సిపాల్టీల్లో 17వేల మందికి పైగా అభ్యర్థులు, కార్పొరేషన్లనో 3300కుపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. మున్సిపాల్టీల్లో ఓటర్ల సంఖ్య 67 లక్షలు, కార్పొరేషన్లలో 25.47లక్షల ఓటర్లున్నారన్నారు. మున్సిపాల్టీల్లో 6వేలకుపైగా పోలింగ్ స్టేషన్లు, 3వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందినే మున్సిపాల్టీ ఎన్నికలకు వినియోగించనున్నామన్నారు. అదనంగా 45 మంది డీఎస్పీలు, 50 మందికిపైగా ఇన్స్పెక్టర్లు, ఏపీఎస్పీకి చెందిన 130 ప్లటూన్ల సిబ్బంది, 16 కంపెనీల కేంద్ర బలగాలు వినియోగించనున్నట్టు రమాకాంత్ రెడ్డి తెలిపారు. -
మున్సిపోల్స్ బరిలో 17,795 మంది!
-
ఈసీ రమాకాంత్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
కిరణ్ సర్కారు నిర్వాకమే
స్థానిక ఎన్నికల గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మునిసిపల్, పంచాయతీరాజ్ రిజర్వేషన్ల ఖరారుపై ఎన్నిసార్లు కోరినా స్పందించలేదు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పినా పట్టించుకోలేదు రిజర్వేషన్ల ఖరారు బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలన్నా వినలేదు లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఉన్నా కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఈ ఎన్నికలను కానీ, ఎన్నికల ఫలితాలను కానీ.. కోర్టులు ఆదేశిస్తే తప్ప వాయిదా వేయం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావటం.. తద్వారా రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు నెలకొనటానికి కారణం గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ గందరగోళ ఎన్నికలకు పూర్తి బాధ్యత గత (మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని) ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. రమాకాంత్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ గందరగోళంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. స్థానిక సంస్థలైన మునిసిపల్, పంచాయతీరాజ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఎన్నిమార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన దుయ్యబట్టారు. కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని పంచాయతీరాజ్, పురపాలక శాఖ కార్యదర్శులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వివరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నతస్థానాల్లో ఉన్నవారితో కూడా ఈ అంశంపై చర్చించినా లాభం లేకపోయిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నా.. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్లను రూపొందించి తన బాధ్యతను దించుకుందని వ్యాఖ్యానించారు. ఆ బాధ్యత మాకు అప్పగించాలన్నా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటిస్తే తప్ప తాము ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితుల వల్లే.. నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ఇబ్బంది ఉండదన్నారు. కేంద్రంలో 30 సంవత్సరాలకు ఓసారి ఒక కమిటీ వేసి రిజర్వేషన్లు ఖరారు చేస్తారని, అందువల్ల ఎన్నికల ప్రక్రియను వారు సకాలంలో పూర్తి చేయగలుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల సీట్ల రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని రెండేళ్ల కిందట తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని రమాకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘వాయిదా’పై సీఈసీ చెప్పినా వినం... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా.. ఫలితాలు వాయిదా వేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కొన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తమ దృష్టికి వచ్చిం దని కమిషనర్ తెలిపారు. ఈ రెండు సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవేనని పేర్కొన్నారు. ఫలితాలు వాయిదా వేయాలని తమను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించజాలదని, ఒకవేళ ఆదేశించినా తాము పట్టించుకునే సమస్య లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించినా పట్టించుకోబోమన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపబోమని తెలిపారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాక కోర్టులు కూడా ఎన్నికలు ఆపాలని ఆదేశాలు ఇవ్వలేవని.. ఒకవేళ అలా ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తామని చెప్పారు. -
పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
మున్సిపల్ నామినేషన్లు ప్రక్రియ షురూ
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలివిడత 146 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. 10 నగర పాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లకు పోటీ ఏర్పడింది. ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల కమిషన్ త్వరలోనే ఎన్నికలు నిర్వహించనుంది. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మార్చి 10: నామినేషన్ల స్వీకరణ మార్చి 13: నగర పాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 14: మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు గడవు మార్చి 15: నామినేషన్ల పరిశీలన మార్చి 18: నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 30: పోలింగ్ ఏప్రిల్ 2: ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
'ఇంత గందరగోళానికి గత ప్రభుత్వమే కారణం'
-
ఇంత గందరగోళానికి గత ప్రభుత్వమే కారణం:రమాకాంత్ రెడ్డి
హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వాయిదా వేయమనే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రమాకాంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన పలు విషయాలను ఆయన సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను కనీసం వాయిదా వేయమని కొన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని తెలిపారు. కాగా కోర్టు నియమావళికి లోబడే నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయన్నారు. ఏప్రిల్ 6వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మార్చి 20వ తేదీతో ముగించి, 21తేదీన నామినేషన్లను పరిశీలిస్తామన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మార్చి 24తో ముగుస్తుందన్నారు. ఏప్రిల్ 8వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం చోటు చేసుకున్నపరిస్థితులకు గత ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం షరిషత్ ఎన్నికలకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతటి గందరగోళం ఉండేది కాదని రమాకాంత్ రెడ్డి తెలిపారు. -
మున్సిపోల్స్‌కు సర్వం సన్నద్ధం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం రాష్ర్ట ఎన్నికల కమిషన్ రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టినఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయని, 145 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడానికి 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమాకాంత్‌రెడ్డికి కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రాలను కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను ఈనెల 7న మరోసారి ప్రకటిస్తామని, పోలీసు సిబ్బంది నియామకంపై ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ఓటరు స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జోనల్ బాధ్యతను గెజిటెడ్ అధికారులకే ఇస్తున్నామనీ, వీరికి మెజిస్ట్రీయల్ అధికారాలు కూడా కల్పించామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ బృందాలు ఇప్పటికే వివిధ పార్టీల హోర్డింగ్‌లు, బ్యానర్లు, వాల్‌రైటింగ్‌లు తొలగిస్తున్నాయన్నారు. బెల్ట్ షాప్‌లు మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్పీ శెముషీ, డీఆర్ఓ దయానంద్తోపాటు మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పోల్స్’ ప్రభావం
-
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పోల్స్’ ప్రభావం
సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఫలితాలు ప్రకటించొద్దు సీఈవోకి రాజకీయ పార్టీల వినతి ఫలితాల వాయిదాపై ఈసీకి నివేదిస్తాం: సీఈవో భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందుగా జరగనున్న మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీలైతే మునిసిపల్ ఎన్నికలు ముందుగా జరగకుండా చూడాలని, అలా సాధ్యం కాని పక్షంలో ఆ ఎన్నికల ఫలితాలనైనా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ వెల్లడించకుండా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు రాజకీయ పార్టీలన్నీ విన్నవించాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం భన్వర్‌లాల్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ సి.కమలాకర్ రెడ్డి (కాంగ్రెస్), రవీందర్ (టీడీపీ), వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), కె.లక్ష్మణ్ (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని భన్వర్‌లాల్ కోరారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా నిలుపుదల చేసే అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు. మున్నిపోల్స్ సన్నద్ధంపై రమాకాంత్‌రెడ్డి చర్చ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో బుధవారం బుద్ధభవన్‌లో సమావేశం నిర్వహించారు. డీజీపీ ప్రసాదరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ, సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించారు. స్థానిక సంస్థల్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు బలగాల మోహరింపు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ప్రసాదరావు, శాంతిభద్రతల అదనపు డీజీపీతో చర్చించారు. చెక్‌పోస్టులు, పట్టణాలు, నగరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి... అక్రమంగా డబ్బు తరలిస్తుంటే సీజ్ చేయాలని నిర్దేశించారు. అనధికార మద్యం షాపులను తక్షణమే మూసివేయించాలని, మద్యం దుకాణాలు ప్రభుత్వం విధించిన సమయానికి మించి ఎట్టిపరిస్థితుల్లోనూ తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆశావహులు
ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక ప్రతి వార్డులో ఎన్నికల హడావిడి జోరందుకోనుంది. రాజకీయ పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపోల్స్‌ను రిహార్సల్‌లా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి ఘట్టం ఆసక్తికరంగా మారనుంది. మునిసిపల్ ఎన్నికల ‘కోడ్’ కూసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు 8 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో రాజంపేట మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రం వాయిదా పడ్డాయి. రాజంపేట మునిసిపాలిటీలో పంచాయతీల విలీనానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. ఈ ఏడాది కొత్తగా మునిసిపాలిటీల జాబితాలో చేరిన మైదుకూరుతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అన్ని మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల ఖర్చు రూ. లక్ష- 1.50 లక్షలు: మునిసిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగా లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే కార్పొరేషన్ పరిధిలోని అభ్యర్థులు 1.50లక్షల వరకూ ఎన్నికల వ్యయంగా నిర్ణయించారు. నిబంధనల మేరకు ఈ పరిధిని దాటి ఖర్చు చే సినట్లు ఎన్నికల కమిషన్‌కు ఆధారిత ఫిర్యాదులు అందితే అనర్హులుగా వేటు పడే ప్రమాదముంది. 41 నెలల పాటు ప్రత్యేక పాలనలో: జిల్లాలో బద్వేలు మినహా తక్కిన కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబరు 29తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనతో మునిసిపాలిటీలు నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 41 నెలల తర్వాత ఈ నెల మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. కాగా బద్వేలు మున్సిపాలిటీ పదవీకాలం కూడా గత ఏడాది జూన్10తో పూర్తయింది. -
30న మున్సిపల్ ఎన్నికలు
* 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ * ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ * ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్.. ఫలితాలు * ఏప్రిల్ 7న పరోక్ష పద్ధతిలో మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక * ప్రస్తుతం 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనే ఎన్నికలు * 95,35,824 మంది ఓటర్లకు 9,015 పోలింగ్ కేంద్రాలు * ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించిన రమాకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల భేరి మోగింది. పోలింగ్, ఫలితాలు, పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక షెడ్యూల్‌తో పాటు రాష్ట్రస్థాయి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని కమిషనర్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదీన జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏప్రిల్ 7న చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారని తెలిపారు. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికకు ఈనెల 20వ తేదీన వేరుగా నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఏప్రిల్ ఏడో తేదీతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. కౌన్సిలర్లకు గరిష్టంగా లక్ష రూపాయలు, కార్పొరేటర్లకు గరిష్టంగా లక్షన్నర రూపాయల ఎన్నికల వ్యయ పరిమితిని నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో డిపాజిట్ ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500గా, కార్పొరేషన్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000గా నిర్ణయించామన్నారు. 11 వేల ఈవీఎంల వినియోగం ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంలలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌవ్) ఆప్షన్‌ను పొందుపరిచేందు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 49,583 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు సీఎంలకు వివరించానని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఫిబ్రవరి 26వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేని విధంగా సెలవు రోజున పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 7న వస్తుందని భావిస్తున్నామని, అప్పటికి ఈ ఎన్నికలు పూర్తవుతాయని, అవసరమైతే మేయర్, చైర్పర్సన్ల ఎన్నికలు ఒకటీ రెండురోజులు ముందుకు జరుపుతామని చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా విలేకరుల భేటీలో పాల్గొన్నారు. తక్షణం అమల్లోకి నియమావళి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుం దన్నారు. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారి బదిలీలు పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు బదిలీలు చేసినా, అమలుకాని పక్షంలో వాటిని ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరిగా బదిలీలు చేయాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రారంభోత్సవాలూ చేయడానికి వీల్లేదన్నారు. -
30న మునిసిపల్ ఎన్నికలు
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఎట్టకేలకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. ప్రచార ఖర్చు మునిసిపాలిటీలకు లక్ష, కార్పొరేషన్లకు లక్షన్నర పరిమితిగా విధించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణకు చివరి రోజు. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఏదో కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని, ఈ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఎన్నికల ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. హైకోర్టు తమకు డెడ్ లైన్ విధించిందని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సీరియస్:రమాకాంత్ రెడ్డి
-
30న మునిసిపల్ ఎన్నికలు
-
మున్సిపోల్స్‌కు కసరత్తు
శ్రీకాకుళం సిటీ మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసినట్లు సంకేతాలు అందడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. శని, ఆదివారాల్లో ఇటు ఎన్నికల అధికారులు, అటు మున్సిపల్ అధికారులు ఆ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. కోర్టు కేసులు, ఇతరత్రా ఇబ్బం దులు లేని మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లను శనివారమే ప్రకటించిన అధికారులు, ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాలు విడుదల చేశారు. ఆమదాలవలసలో 23 వార్డులు, ఇచ్ఛాపురంలో 23 వార్డులు, పలాస-కాశీబుగ్గలో 25 వార్డులు, పాలకొండలో 20 వార్డుల తుది ఓటర్ల జాబితాలను సంబంధిత కమిషనర్లు ఆదివారం ప్రకటించారు. శ్రీకాకుళం, రాజాంలలో కోర్టు కేసుల కారణంగా ఈ దఫా ఎన్నికలు జరగకపోవడంతో ఈ రెండు చోట్ల ఓటర్ల జాబితాలు ప్రకటించలేదని అధికారులు తెలిపారు. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాాంతరెడ్డి సోమవారం దీని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీని సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చర్చించినట్లు సమాచారం. అయితే ఏప్రిల్‌లో పార్లమెంట్‌తో సహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం మేలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే.. శ్రీకాకుళం, రాజాం మున్సిపాలిటీలు మినహా ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఈ మున్సిపాలిటీల్లో అధికార సిబ్బంది వివరాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే సేకరించారు. నేడు వీడియో కాన్ఫరెన్స్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చేయాల్సినఏర్పాట్లు, అధికారుల విధు లు, అవసరమైన ఈవీఎంలు ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సోమవా రం ఉదయం మున్సిపల్ శాఖ కమిషనర్ బి.జనార్ధనరెడ్డి రాష్ట్రంలోని అంద రు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. -
రమాకాంత్‌రెడ్డి మీడియా సమావేశం 27th July 2013
-
ఈసీ రమాకాంత్ రెడ్డి మీడియా సమావేశం
-
రమాకాంత్ రెడ్డితో టు ది పాయింట్