'మున్సిపల్ లో ఓటు వేస్తే, పరిషత్ ఎన్నికలకు అనర్హులు'
'మున్సిపల్ లో ఓటు వేస్తే, పరిషత్ ఎన్నికలకు అనర్హులు'
Published Thu, Apr 10 2014 5:31 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసినవారు గురువారం జరిగే పరిషత్ ఎన్నికలకు అనర్హులని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేపు నిర్వహించే తుది విడత పరిషత్ పోలింగ్‌కు సర్వం సిద్దం అని తెలిపారు. 536 జెడ్ పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజలు ఓటుహక్కు వినియోగించిందుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25,758 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 5,075 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్టు ఆయన తెలిపారు. ఎన్నికలలు నిర్వహించే ప్రదేశాల్లో 6,057 సమస్యాత్మక ప్రాంతాలుగా, 6,463 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement