మే7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు!
మే7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు!
Published Sat, Mar 29 2014 4:40 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
హైదరాబాద్: మున్సిపల్ ఫలితాల వాయిదాపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు వాయిదాపై ఏప్రిల్ 1వ తేదీన హైకోర్టు నిర్ణయం వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారంమే తాము వ్యవహరిస్తామని రమాకాంత్‌రెడ్డి ఓప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏప్రిల్ 6, 11 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మే 7 తర్వాతే వెల్లడిస్తామని ఆయన అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడించే తేదీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల తేది మార్పును సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
146 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లలో ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకూ పోలింగ్ జరుగుతుందని, మున్సిపాల్టీల్లో పదివేలకుపైగా ఈవీఎంల వాడతున్నామన్నారు. కార్పొరేషన్లలో 3814 ఈవీఎంలను, మున్సిపాల్టీల్లో 17వేల మందికి పైగా అభ్యర్థులు, కార్పొరేషన్లనో 3300కుపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు.
మున్సిపాల్టీల్లో ఓటర్ల సంఖ్య 67 లక్షలు, కార్పొరేషన్లలో 25.47లక్షల ఓటర్లున్నారన్నారు.
మున్సిపాల్టీల్లో 6వేలకుపైగా పోలింగ్ స్టేషన్లు, 3వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందినే మున్సిపాల్టీ ఎన్నికలకు వినియోగించనున్నామన్నారు. అదనంగా 45 మంది డీఎస్పీలు, 50 మందికిపైగా ఇన్‌స్పెక్టర్లు, ఏపీఎస్పీకి చెందిన 130 ప్లటూన్ల సిబ్బంది, 16 కంపెనీల కేంద్ర బలగాలు వినియోగించనున్నట్టు రమాకాంత్ రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement