ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ తుదివిడత పోలింగ్
హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ తుదివిడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసాయి. స్వల్పఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 13న రీపోలింగ్ నిర్వహిస్తాం అని తెలిపారు.
విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండలం బూసికుట్టులో మావోలు బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారని మీడియాకు తెలిపారు. బూసికట్టులో మాత్రం ఈనెల 16న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రమాకాంత్ రెడ్డి చెప్పారు.
వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసాయని ఆయన తెలిపారు.