
గత ప్రభుత్వం వల్లే ఎన్నికల నిర్వహణ ఆలస్యం: ఈసీ
గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. రాష్టవ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూరైందన్నారు. బుధవారం హైదరాబాద్లో రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ... నిజమాబాద్ జిల్లా బండపల్లి, మైలారం ఎంపీటీసీ స్థానాలలో ఈ నెల 18న రీపోలింగ్ జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న వారందరికి రమాకాంత్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే తూర్పు ఎర్రబెల్లిలో బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టాయని తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా మామిడాల ఎంపీటీసీ స్థానాల్లో బ్యాలెట్ బాక్సులు, పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ, నిడదవోలు ఎంపీటీసీ స్థానాల్లో బ్యాలెట్ బాక్స్లు తడిచాయని చెప్పారు.