రాజీవ్ శర్మతో రమాకాంత్ రెడ్డి భేటి!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి అనుసరించిన విధానాలపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమాకాంత్‌రెడ్డి భేటి అయ్యారు.
రాజీవ్ శర్మతో భేటి తర్వాత రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు, సెగ్మెంట్ల వారిగా ఓటర్ల వివరాల గురించి చర్చించామని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, రిజర్వేషన్లు, డీ లిమిటేషన్ ఖరారు కోసం ప్రభుత్వానికి లేఖ రాశామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు.