బ్యాలెట్ పత్రాలు తారుమారు: రమాకాంత్ రెడ్డి | ballot papers changed in some places, says ramakanth reddy | Sakshi
Sakshi News home page

బ్యాలెట్ పత్రాలు తారుమారు: రమాకాంత్ రెడ్డి

Published Fri, Apr 11 2014 11:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

బ్యాలెట్ పత్రాలు తారుమారు: రమాకాంత్ రెడ్డి

బ్యాలెట్ పత్రాలు తారుమారు: రమాకాంత్ రెడ్డి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 15-20 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ నిలిచిపోయిన కేంద్రాల్లో ఈనెల 13వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

రెండు చోట్ల రీపోలింగ్ జరిపే అవకాశం ఉందని రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. చిన్న చిన్న ఘర్షణల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు .సాయంత్రం 5 గంటల వరకు అన్నిచోట్లా పోలింగ్ జరుగుతుందని, అందరూ సమైక్యంగా కృషి చేయడం వల్లే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement