రాఖీ సింఘ్ కుటుంబసభ్యులు
భువనేశ్వర్ : కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఓ వైద్యుడి కుటుంబాన్ని ఊర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. సర్పంచ్, పోలీసులు ఎంత నచ్చచెప్పినా గ్రామస్తులు పంతం వీడకపోవటంతో, వైద్యుని కుటుంబసభ్యులు రాత్రంతా కారులోనే గడపాల్సివచ్చింది. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ రాఖీ సింఘ్ తెలంగాణ రాష్ట్రం నుంచి స్థానిక గొండొరొపూర్ గ్రామానికి తన కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు. అనుమతి పత్రాలు చూపించినా సరే గ్రామస్తులు వారిని గ్రామంలోనికి వెళ్లనివ్వలేదు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు పంతం వీడలేదు.
( ‘కరోనా’ వాహకులు వీరే )
ఒకనొక సమయంలో సర్పంచ్, పోలీసులు కూడా తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని రాఖీ సింఘ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యలకు నిరసనగా డాక్టర్ కుటుంబం రాత్రంతా కారులోనే ఉండిపోయింది. ఉదయం కొందరు గ్రామస్తులు వారి కారుపైకి రాళ్లు రువ్వినట్లు వారు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంట నగరాల పోలీసు కమిషనర్ సుధాంశు షడంగికి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment